చెల్లెఁ జెల్లె నీచేఁత శింగరి నీ
(॥పల్లవి॥)
చెల్లెఁ జెల్లె నీచేఁత శింగరి నీ-
వుల్లమెల్లఁ దక్కఁ గొంటినో శింగరి
(॥చెల్లె॥)
చిక్కని నీనవ్వుచూచి శింగరి నే
నొక్కటై నీకు మొక్కితినో శింగరి
చెక్కులఁ జెమటగారె శింగరి నీ
వుక్కుగోరు సోఁకనీకు వో శింగరి
(॥చెల్లె॥)
చిరుత నిట్టూర్పుల శింగరి నిను
నొరసీఁబో నాకు చాలు వోశింగరి
సిరుల నిట్టచూపు శింగరి నీ
వొరపు నాచేతఁజిక్కెనో శింగరి
(॥చెల్లె॥)
చేవదేరె నీమోవి శింగరి నే
నోవరిలోఁ గూడఁగానె వో శింగరి
శ్రీ వేంకటాద్రిమీఁది శింగరి
వోవమన సిగ్గుదేరెనో శింగరి
(||pallavi||)
sĕllĕm̐ jĕllĕ nīsem̐ta śhiṁgari nī-
vullamĕllam̐ dakkam̐ gŏṁṭino śhiṁgari
(||sĕllĕ||)
sikkani nīnavvusūsi śhiṁgari ne
nŏkkaḍai nīgu mŏkkidino śhiṁgari
sĕkkulam̐ jĕmaḍagārĕ śhiṁgari nī
vukkugoru som̐kanīgu vo śhiṁgari
(||sĕllĕ||)
siruda niṭṭūrbula śhiṁgari ninu
nŏrasīm̐bo nāgu sālu vośhiṁgari
sirula niṭṭasūbu śhiṁgari nī
vŏrabu nāsedam̐jikkĕno śhiṁgari
(||sĕllĕ||)
sevaderĕ nīmovi śhiṁgari ne
novarilom̐ gūḍam̐gānĕ vo śhiṁgari
śhrī veṁkaḍādrimīm̐di śhiṁgari
vovamana sigguderĕno śhiṁgari