Sellem gade neemaada semcheda neegu

చెల్లెఁ గదె నీమాట చెంచెత నీకు
Language

(॥పల్లవి॥)
చెల్లెఁ గదె నీమాట చెంచెత నీకు
చెల్లుబడిగలచోటఁ జెప్పనేఁటికయ్యా

(॥చెల్లె॥)
చిగురుఁబయ్యద యేలే చెంచెత నీకు
చిగురు మాయడవిలో సేనాసేన
నిగురుఁబసిండిచేల నీకేలయ్యా మా.-
పగటుమెరుపు గొంతపసిఁడి రాలె

(॥చెల్లె ॥)
చిల్లపూవుదండలేలే చెంచెత నీకు
చెల్లెఁబో మాకులమీఁద సేనాసేన
చల్లఁగా నీకుఁ దొళసిసరమేలయ్యా
యిల్లిదె మాయేటిదరి నింతా నిదే

(॥చెల్లె॥)
చేరితివిగదె నన్ను చెంచెత నీవు
చేరె నాకాఁగిటి కదె సేనాసేన
ఆరయ శ్రీవేంకటేశ అవునవునయ్యా
నీరువంక తుంగవైతి నిజమరివయ్యా

(||pallavi||)
sĕllĕm̐ gadĕ nīmāḍa sĕṁchĕda nīgu
sĕllubaḍigalasoḍam̐ jĕppanem̐ṭigayyā

(||sĕllĕ||)
sigurum̐bayyada yele sĕṁchĕda nīgu
siguru māyaḍavilo senāsena
nigurum̐basiṁḍisela nīgelayyā mā.-
pagaḍumĕrubu gŏṁtabasim̐ḍi rālĕ

(||sĕllĕ ||)
sillabūvudaṁḍalele sĕṁchĕda nīgu
sĕllĕm̐bo māgulamīm̐da senāsena
sallam̐gā nīgum̐ dŏḽasisaramelayyā
yillidĕ māyeḍidari niṁtā nide

(||sĕllĕ||)
seridivigadĕ nannu sĕṁchĕda nīvu
serĕ nāgām̐giḍi kadĕ senāsena
āraya śhrīveṁkaḍeśha avunavunayyā
nīruvaṁka tuṁgavaidi nijamarivayyā