చెల్లఁబో యింతేసి పని సేతురా నీవు
(॥పల్లవి॥)
చెల్లఁబో యింతేసి పని సేతురా నీవు
కల్ల లంటేఁ బో నిను కమ్మిరింతుఁ గాని
(॥చెల్లఁబో॥)
కంటి నొక్క కల నేను కాముఁడట నిన్ను నన్ను
వింటఁ బూఁచి విరులనే వేసునటా
గొంటరివై నీవు నన్ను గోర గీరితట మేన
గంటి లే దప్పటి నేవ్వి గనమాయఁ గాని
(॥చెల్లఁబో॥)
అందులోనే వేరొకటి ఆకపుచందురుఁడు
చిందేటికళలు రేచి చిక్కించు నట
దిందుపడ మానముపై తిట్టుదువట సాకిరి
యెందును లేదు కోపమె యెక్కివచ్చీఁ గాని
(॥చెల్లఁబో॥)
చాయల శ్రీవేంకటేశ చల్లగాలి మనలోన
నాయమున కుంటెనలు నడపు నట
ఆయెడఁ గాలు దొక్కితి వట కూడితి వట
మాయ లాయ నవి లే సీ మరి నిక్కటాయను
(||pallavi||)
sĕllam̐bo yiṁtesi pani sedurā nīvu
kalla laṁṭem̐ bo ninu kammiriṁtum̐ gāni
(||sĕllam̐bo||)
kaṁṭi nŏkka kala nenu kāmum̐ḍaḍa ninnu nannu
viṁṭam̐ būm̐si virulane vesunaḍā
gŏṁṭarivai nīvu nannu gora gīridaḍa mena
gaṁṭi le dappaḍi nevvi ganamāyam̐ gāni
(||sĕllam̐bo||)
aṁdulone verŏgaḍi āgabusaṁdurum̐ḍu
siṁdeḍigaḽalu resi sikkiṁchu naḍa
diṁdubaḍa mānamubai tiṭṭuduvaḍa sāgiri
yĕṁdunu ledu kobamĕ yĕkkivachchīm̐ gāni
(||sĕllam̐bo||)
sāyala śhrīveṁkaḍeśha sallagāli manalona
nāyamuna kuṁṭĕnalu naḍabu naḍa
āyĕḍam̐ gālu dŏkkidi vaḍa kūḍidi vaḍa
māya lāya navi le sī mari nikkaḍāyanu