చెల్లఁబో యింత పచ్చి సేయవలెనా
(॥పల్లవి॥)
చెల్లఁబో యింత పచ్చి సేయవలెనా
వుల్లములో మీకు మీకే వొప్పుగొనఁ దగదా
(॥చెల్లఁ॥)
కూడిపాయరానిచోట కోపగించితే నేమాయ
సూడుఁబాడు పతితోనే చూపవలెనా
మేడెపు దంపతులకు మేరదప్పితే నేమాయ
జాడతోనే అతనికిఁ జనవియ్యఁదగదా
(॥చెల్లఁ॥)
యేకచిత్తాలైనచోట నేమి సేసిన నేమాయ
పై కొన్నవిభునితోనే పంతమా నీకు
నీకు నీకుఁ బ్రాణప్రాణనేస్తమైనచోట
చౌకగా కతనికి నిచ్చకమాడఁదగదా
(॥చెల్లఁ॥)
తనువులంటినచోట తమకించితే నేమాయ
ననిచినచోట నిది నాయమా నీకు
యెనసీ శ్రీవేంకటేశుఁ డిటువంటిమీచోట
ననగిఁ పెనఁగి ఇట్టె ఆదరించఁదగదా
(||pallavi||)
sĕllam̐bo yiṁta pachchi seyavalĕnā
vullamulo mīgu mīge vŏppugŏnam̐ dagadā
(||sĕllam̐||)
kūḍibāyarānisoḍa kobagiṁchide nemāya
sūḍum̐bāḍu padidone sūbavalĕnā
meḍĕbu daṁpadulagu meradappide nemāya
jāḍadone adanigim̐ janaviyyam̐dagadā
(||sĕllam̐||)
yegasittālainasoḍa nemi sesina nemāya
pai kŏnnavibhunidone paṁtamā nīgu
nīgu nīgum̐ brāṇaprāṇanestamainasoḍa
saugagā kadanigi nichchagamāḍam̐dagadā
(||sĕllam̐||)
tanuvulaṁṭinasoḍa tamagiṁchide nemāya
nanisinasoḍa nidi nāyamā nīgu
yĕnasī śhrīveṁkaḍeśhum̐ ḍiḍuvaṁṭimīsoḍa
nanagim̐ pĕnam̐gi iṭṭĕ ādariṁcham̐dagadā