Sellambo yimkaa nele se patlu

చెల్లఁబో యింకా నేలే చే పట్లు
Language

(॥పల్లవి॥)
చెల్లఁబో యింకా నేలే చే పట్లు
చల్లఁగా తానుండ నే సాదించేనా

(॥చెల్ల॥)
మనసు వచ్చిన వారిమాటలే యమరుఁ గాక
ననుపు చాలనిమాట నవ్వులు గావా
యెనసి నే నూరకున్న నేల దూరీనే నన్ను
తనమోహముకొలఁది తా నెరఁగఁడా

(॥చెల్ల॥)
పిలిచినవారి రాక ప్రియములై యుండుఁ గాక
బలిమిఁ జొచ్చి వచ్చితే పాటి వట్టేరా
నిలిచీ దగ్గరనంటా నేర మే లెంచీనే నన్ను
తలఁ చేటితనతమి తానెరఁ గఁడా

(॥చెల్ల॥)
సరసమాడేటివారి చనవులే చెల్లుఁగాక
యెరవులవారిచన వెందాఁకానే
యిరవై శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడినాఁడు
తరవాతితనపని తా నెఱఁగఁడా

(||pallavi||)
sĕllam̐bo yiṁkā nele se paṭlu
sallam̐gā tānuṁḍa ne sādiṁchenā

(||sĕlla||)
manasu vachchina vārimāḍale yamarum̐ gāga
nanubu sālanimāḍa navvulu gāvā
yĕnasi ne nūragunna nela dūrīne nannu
tanamohamugŏlam̐di tā nĕram̐gam̐ḍā

(||sĕlla||)
pilisinavāri rāga priyamulai yuṁḍum̐ gāga
balimim̐ jŏchchi vachchide pāḍi vaṭṭerā
nilisī daggaranaṁṭā nera me lĕṁchīne nannu
talam̐ seḍidanadami tānĕram̐ gam̐ḍā

(||sĕlla||)
sarasamāḍeḍivāri sanavule sĕllum̐gāga
yĕravulavārisana vĕṁdām̐kāne
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍinām̐ḍu
taravādidanabani tā nĕṟam̐gam̐ḍā