చెల్లఁబో యింకా నేల సిగ్గు గాదా
(॥పల్లవి॥)
చెల్లఁబో యింకా నేల సిగ్గు గాదా
యెల్లవారు నెరిఁగిరి యిఁక నేడ సుద్దులు
(॥చెల్లఁ॥)
ధరఁ జెఱఁగుమాసినదానిఁ జేర రాకువయ్య
సొరిది నల్లంత నుండి చూతువు గాని
వరుస దప్పితే నాడవారిమీఁదియాన సుమ్మీ
యెరవుల వారమైతి మిఁక నేడ సుద్దులు
(॥చెల్లఁ॥)
మాటున నున్న దానితో మాటాడకువయ్య నీవు
ఆఁటదాని చేతఁ జెప్పి యంపుదు గాని
కూటమికిఁ బెనఁగితే కుచ్చి రట్టుసేతుఁ జుమ్మీ
యేఁటికి నవ్వులు నవ్వే విఁక నేడ సుద్దులు
(॥చెల్లఁ॥)
చిందువందయినదానిఁ జెనకకువయ్య నీవు
కందువ చెప్పెంపే మీఁదఁ గలతు గాని
పొందితి వింతలో నన్నుఁ బోనిక శ్రీ వేంకటేశ
ఇందులో నన్నియుఁ గంటి మిఁక నేడ సుద్దులు
(||pallavi||)
sĕllam̐bo yiṁkā nela siggu gādā
yĕllavāru nĕrim̐giri yim̐ka neḍa suddulu
(||sĕllam̐||)
dharam̐ jĕṟam̐gumāsinadānim̐ jera rāguvayya
sŏridi nallaṁta nuṁḍi sūduvu gāni
varusa dappide nāḍavārimīm̐diyāna summī
yĕravula vāramaidi mim̐ka neḍa suddulu
(||sĕllam̐||)
māḍuna nunna dānido māḍāḍaguvayya nīvu
ām̐ṭadāni sedam̐ jĕppi yaṁpudu gāni
kūḍamigim̐ bĕnam̐gide kuchchi raṭṭusedum̐ jummī
yem̐ṭigi navvulu navve vim̐ka neḍa suddulu
(||sĕllam̐||)
siṁduvaṁdayinadānim̐ jĕnagaguvayya nīvu
kaṁduva sĕppĕṁpe mīm̐dam̐ galadu gāni
pŏṁdidi viṁtalo nannum̐ boniga śhrī veṁkaḍeśha
iṁdulo nanniyum̐ gaṁṭi mim̐ka neḍa suddulu