Sellambo yennaallainaam jinnadaanavaa

చెల్లఁబో యెన్నాళ్లైనాఁ జిన్నదానవా
Language

(॥పల్లవి॥)
చెల్లఁబో యెన్నాళ్లైనాఁ జిన్నదానవా
వెల్లవిరి నీతనికి వినయాలు సేయవే

(॥॥)
యీపొద్దు నీపతి వచ్చె నేల సిగ్గులువడేవే
చూపుల నివాళ్లీవే సుదతి
తీ పైననీ మోవివిందు తెల్లమిగ జెప్పవే
యేపున నీవేడుకల నెదురుకొనఁ గదే

(॥॥)
నలుగడ సెలవులనవ్వుల ముగ్గువెట్టవే
నిలువుఁ జెమటల పన్నీళ్లియ్యవే
పలుకులకప్పురాల బాగా లొసఁగవే
వెలయఁగ నీమేను విడిదేల సేయవే

(॥॥)
పట్టగునీకాఁగిటఁ బానువు వరచవే
గట్టినీ చన్నులఁ దలగడ వెట్టవే
యిట్టె శ్రీవేంకటేశు డిన్నిటా నిన్నుఁ గూడె
జట్టిగొన్నరతి నుపచారాలు సేయవే

(||pallavi||)
sĕllam̐bo yĕnnāḽlainām̐ jinnadānavā
vĕllaviri nīdanigi vinayālu seyave

(||||)
yībŏddu nībadi vachchĕ nela sigguluvaḍeve
sūbula nivāḽlīve sudadi
tī painanī moviviṁdu tĕllamiga jĕppave
yebuna nīveḍugala nĕdurugŏnam̐ gade

(||||)
nalugaḍa sĕlavulanavvula mugguvĕṭṭave
niluvum̐ jĕmaḍala pannīḽliyyave
palugulagappurāla bāgā lŏsam̐gave
vĕlayam̐ga nīmenu viḍidela seyave

(||||)
paṭṭagunīgām̐giḍam̐ bānuvu varasave
gaṭṭinī sannulam̐ dalagaḍa vĕṭṭave
yiṭṭĕ śhrīveṁkaḍeśhu ḍinniḍā ninnum̐ gūḍĕ
jaṭṭigŏnnaradi nubasārālu seyave