Sellambo yennaallainaam jinnadaanavaa

చెల్లఁబో యెన్నాళ్లైనాఁ జిన్నదానవా
Language

(॥పల్లవి॥)
చెల్లఁబో యెన్నాళ్లైనాఁ జిన్నదానవా
వొల్లనె నీవాతని వొడివట్టరాదా

(॥చెల్లఁ॥)
వలపేల దాఁచేవే వాసులేల రేఁచేవే
వెలయఁ బతికి విన్నవించరాదా
తలఁపేల మఱేవు తమియేల విరిచేవు
పిలిచి ఆయాలుసోఁక బెనఁగరాదా

(॥చెల్లఁ॥)
సిగ్గులేల పెంచేవే శిరసేల వంచేవే
వొగ్గి నీ చనుమొనల నొత్తరాదా
తగ్గి యేఁటి కలసేవు దానికేల సొలసేవు
వెగ్గళించి పొందు వెల్లవిరిసేయరాదా

(॥చెల్లఁ॥)
నేమమెంత సేసేవా నేలలేమి వాసేవే
ఆముకొని సరసములాడఁగ రాదా
వేమరు శ్రీవేంకటేశు వెస నీవు గూడితివి
యీమెయి నలమేల్మంగ విరపుకోరాదా

(||pallavi||)
sĕllam̐bo yĕnnāḽlainām̐ jinnadānavā
vŏllanĕ nīvādani vŏḍivaṭṭarādā

(||sĕllam̐||)
valabela dām̐seve vāsulela rem̐seve
vĕlayam̐ badigi vinnaviṁcharādā
talam̐pela maṟevu tamiyela virisevu
pilisi āyālusom̐ka bĕnam̐garādā

(||sĕllam̐||)
siggulela pĕṁcheve śhirasela vaṁcheve
vŏggi nī sanumŏnala nŏttarādā
taggi yem̐ṭi kalasevu dānigela sŏlasevu
vĕggaḽiṁchi pŏṁdu vĕllaviriseyarādā

(||sĕllam̐||)
nemamĕṁta sesevā nelalemi vāseve
āmugŏni sarasamulāḍam̐ga rādā
vemaru śhrīveṁkaḍeśhu vĕsa nīvu gūḍidivi
yīmĕyi nalamelmaṁga virabugorādā