Sellambo yemi seppedi jeevuni yajnyaaanamu

చెల్లఁబో యేమి చెప్పేది జీవుని యజ్ఞానము
Language

(॥పల్లవి॥)
చెల్లఁబో యేమి చెప్పేది జీవుని యజ్ఞానము
తెల్లమైన పను లెల్లా దెలిసీఁ దెలియఁడు

(॥చెల్లఁ॥)
అప్పిచ్చి వడ్డిలాభాన కా దినము లెంచుఁ గాని
కప్పి సరివచ్చే గతకాల మెంచఁడు
యెప్పుడు నింతులఁ గూడి యింపులే తలఁచుఁ గాని
చిప్పిలి దేహము సమసేది దలఁచఁడు

(॥చెల్లఁ॥)
పంతముతో వేఁటలాడి ప్రతాపమే చూచుఁ గాని
బంతినే చుట్టుకొనే పాపము చూడఁడు
వింతవారి సొమ్ము వేడుక వూహించుఁ గాని
వంతలఁ దిరుగ దిద్దవలయు టూహించఁడు

(॥చెల్లఁ॥)
అన్నిటాఁ గర్తననే యహంకార మెఱుఁగు గాని
తన్నుఁ బ్రేరించే దైవము తా నెఱుఁగఁడు
యెన్నఁగ శ్రీవేంకటేశ యివి యెల్లా నీమాయలే
మన్నించి బుద్ధి యొసఁగి మనుప నీ భారము

(||pallavi||)
sĕllam̐bo yemi sĕppedi jīvuni yajñānamu
tĕllamaina panu lĕllā dĕlisīm̐ dĕliyam̐ḍu

(||sĕllam̐||)
appichchi vaḍḍilābhāna kā dinamu lĕṁchum̐ gāni
kappi sarivachche gadagāla mĕṁcham̐ḍu
yĕppuḍu niṁtulam̐ gūḍi yiṁpule talam̐sum̐ gāni
sippili dehamu samasedi dalam̐sam̐ḍu

(||sĕllam̐||)
paṁtamudo vem̐ṭalāḍi pradābame sūsum̐ gāni
baṁtine suṭṭugŏne pābamu sūḍam̐ḍu
viṁtavāri sŏmmu veḍuga vūhiṁchum̐ gāni
vaṁtalam̐ diruga diddavalayu ṭūhiṁcham̐ḍu

(||sĕllam̐||)
anniḍām̐ gardanane yahaṁkāra mĕṟum̐gu gāni
tannum̐ breriṁche daivamu tā nĕṟum̐gam̐ḍu
yĕnnam̐ga śhrīveṁkaḍeśha yivi yĕllā nīmāyale
manniṁchi buddhi yŏsam̐gi manuba nī bhāramu