Sellambo yela laaseve sigguvaa timtegaaga

చెల్లఁబో యేల లాచేవే సిగ్గువా టింతేకాక
Language

(॥పల్లవి॥)
చెల్లఁబో యేల లాచేవే సిగ్గువా టింతేకాక
చిల్లర వూడిగా లిఁకఁ జేయఁగ రమ్మనీనా

(॥చెల్ల॥)
యేపునఁ దొం గేలచూచే విద్దరు లొన నుండఁగా
కాఁపురాలు సేసేవారిఁ గాకుసేతురా
యీపొద్దు కేరడాలాడి యెఱుకలు సేసేవే
రాఁపుల నాతఁడు నిన్ను రమ్మని పిలిచీనా

(॥చెల్ల॥)
దీకొని దంపతులున్న తెర యేల యెత్తేవే
యేకతపువారిఁ బాయిటవేతురా
కేకలుగొట్టుచు మరి కేరి యేల నవ్వేవే
ఆకె వుండఁగా నిన్ను నండకు రమ్మనీనా

(॥చెల్ల॥)
శ్రీవేంకటేశుఁడు నాపె జెందె శయ్యాల చేరేవే
భావించి పెండ్లాడేవారిఁ బచ్చిసేతురా
పూవులగుత్తులఁ గొని పూఁచి యేల వేసేవే
నీవిభుఁడై తేనేమే నిన్నందు రమ్మనెనా

(||pallavi||)
sĕllam̐bo yela lāseve sigguvā ṭiṁtegāga
sillara vūḍigā lim̐kam̐ jeyam̐ga rammanīnā

(||sĕlla||)
yebunam̐ dŏṁ gelasūse viddaru lŏna nuṁḍam̐gā
kām̐purālu sesevārim̐ gāgusedurā
yībŏddu keraḍālāḍi yĕṟugalu seseve
rām̐pula nādam̐ḍu ninnu rammani pilisīnā

(||sĕlla||)
dīgŏni daṁpadulunna tĕra yela yĕtteve
yegadabuvārim̐ bāyiḍavedurā
kegalugŏṭṭusu mari keri yela navveve
āgĕ vuṁḍam̐gā ninnu naṁḍagu rammanīnā

(||sĕlla||)
śhrīveṁkaḍeśhum̐ḍu nābĕ jĕṁdĕ śhayyāla sereve
bhāviṁchi pĕṁḍlāḍevārim̐ bachchisedurā
pūvulaguttulam̐ gŏni pūm̐si yela veseve
nīvibhum̐ḍai teneme ninnaṁdu rammanĕnā