Sellambo tiyyaninoram jedelayya

చెల్లఁబో తియ్యనినోరఁ జేదేలయ్య
Language

(॥పల్లవి॥)
చెల్లఁబో తియ్యనినోరఁ జేదేలయ్య
కల్ల నిజములు నొక్కట నుండఁగా

(॥చెల్ల॥)
మొదలఁ జెలియమీఁద మోహము చల్లినవాఁడ
విదివో కమ్మరఁ గాఁకలేల చల్లేవు
కదిసి కూటములు కపటము లొకచోటఁ
బొదలించితే కపటము లొకచోటఁ

(॥చెల్ల॥)
ప్రేమపుటాసలు మతిఁ బెంచినవాఁడవు
యేమన్నా నూరకుండే విదేమయ్యా
తామసాలుఁ దత్తరాలుఁ దగులగట్టేనంటే
భూమిలోన నిటువంటిపొందు గలదా

(॥చెల్ల॥)
కంచపుమోవిపొత్తు కలిగి కూడినవాఁడ
విచుకంత పరవళ మిదియేలయ్యా
సంచితవలపు జవ్వనాలు సరిగావా
యెంచఁగలశ్రీవేంకటేశ్వరుఁడా

(||pallavi||)
sĕllam̐bo tiyyaninoram̐ jedelayya
kalla nijamulu nŏkkaḍa nuṁḍam̐gā

(||sĕlla||)
mŏdalam̐ jĕliyamīm̐da mohamu sallinavām̐ḍa
vidivo kammaram̐ gām̐kalela sallevu
kadisi kūḍamulu kabaḍamu lŏgasoḍam̐
bŏdaliṁchide kabaḍamu lŏgasoḍam̐

(||sĕlla||)
premabuḍāsalu madim̐ bĕṁchinavām̐ḍavu
yemannā nūraguṁḍe videmayyā
tāmasālum̐ dattarālum̐ dagulagaṭṭenaṁṭe
bhūmilona niḍuvaṁṭibŏṁdu galadā

(||sĕlla||)
kaṁchabumovibŏttu kaligi kūḍinavām̐ḍa
visugaṁta paravaḽa midiyelayyā
saṁchidavalabu javvanālu sarigāvā
yĕṁcham̐galaśhrīveṁkaḍeśhvarum̐ḍā