చెల్లఁబో తపసు వండి జడవేలయ్య
(॥పల్లవి॥)
చెల్లఁబో తపసు వండి జడవేలయ్య
కొల్లగా వలపు లమ్మీఁ గొనుకొనవయ్యా
(॥చెల్ల॥)
జఱసి జెరసి యాపె సరసములాడఁగాను
నెఱిఁ బరాకైవుండేవు నీవదేమయ్యా
తఱితోడ రతులకుఁ దరవులు వెట్టఁగాను
మఱొకతెతో మాటాడ మరేలయ్యా
(॥చెల్ల॥)
చేయిముట్టి నిన్ను నాకె చెనకుచునుండఁగాను
యేయెడ చూచేవు నీవు యిదేమయ్యా
ఆయములు సొఁకించి ఆసలెల్లఁ జూపఁగాను
చాయసేసుకున్నాఁడవు సరి నదేమయ్యా
(॥చెల్ల॥)
యెచ్చరించి నిన్ను నాకె ఇట్టె కాఁగిలించఁగాను
పచ్చినవ్వులు నవ్వేటిపని యేమయ్యా
ఇచ్చట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యిచ్చకుఁడ విద్దరికి నెట్టయితివయ్యా
(||pallavi||)
sĕllam̐bo tabasu vaṁḍi jaḍavelayya
kŏllagā valabu lammīm̐ gŏnugŏnavayyā
(||sĕlla||)
jaṟasi jĕrasi yābĕ sarasamulāḍam̐gānu
nĕṟim̐ barāgaivuṁḍevu nīvademayyā
taṟidoḍa radulagum̐ daravulu vĕṭṭam̐gānu
maṟŏgadĕdo māḍāḍa marelayyā
(||sĕlla||)
seyimuṭṭi ninnu nāgĕ sĕnagusunuṁḍam̐gānu
yeyĕḍa sūsevu nīvu yidemayyā
āyamulu sŏm̐kiṁchi āsalĕllam̐ jūbam̐gānu
sāyasesugunnām̐ḍavu sari nademayyā
(||sĕlla||)
yĕchchariṁchi ninnu nāgĕ iṭṭĕ kām̐giliṁcham̐gānu
pachchinavvulu navveḍibani yemayyā
ichchaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
yichchagum̐ḍa viddarigi nĕṭṭayidivayyā