చెల్లఁబో నీ గుండె రాతఁ జేసిరా వోయి
(॥పల్లవి॥)
చెల్లఁబో నీ గుండె రాతఁ జేసిరా వోయి
యెల్లవారుఁ గన్నపని కిఁక నేఁటి కోయీ
(॥చెల్ల॥)
మాటలాడ వలదా మా యింటికి రాకుండినా
పోటి దొరవై తేనే పొందు వోయెనా
కోటులాయ నీ చలము కొండలాయ నా చన్నులు
యేటి కిఁక నలుకలు యెందాఁకా నోయి
(॥చెల్ల॥)
చూడనైనా వలదా సుద్దుల చెప్పకుండినా
వాడలు దవ్వయితేనే వావి వోయెనా
నీడ నీమెయి చెమరించె నిక్కి నామెయిపులకించె
యేడకేడకౌ నీవొ ట్లెందాఁకా నోయి
(॥చెల్ల॥)
మేలమాడ వలదా మెరమెచ్చునకునైనా
కాలు దొక్కినంతలోనె కళ దాఁకెనా
జాలువాగె మోవిఁదేనే సరి నీవు గూడఁగాను
యేల శ్రీవేంకటపతి యెందాఁకా నోయి
(||pallavi||)
sĕllam̐bo nī guṁḍĕ rādam̐ jesirā voyi
yĕllavārum̐ gannabani kim̐ka nem̐ṭi koyī
(||sĕlla||)
māḍalāḍa valadā mā yiṁṭigi rāguṁḍinā
poḍi dŏravai tene pŏṁdu voyĕnā
koḍulāya nī salamu kŏṁḍalāya nā sannulu
yeḍi kim̐ka nalugalu yĕṁdām̐kā noyi
(||sĕlla||)
sūḍanainā valadā suddula sĕppaguṁḍinā
vāḍalu davvayidene vāvi voyĕnā
nīḍa nīmĕyi sĕmariṁchĕ nikki nāmĕyibulagiṁchĕ
yeḍageḍagau nīvŏ ṭlĕṁdām̐kā noyi
(||sĕlla||)
melamāḍa valadā mĕramĕchchunagunainā
kālu dŏkkinaṁtalonĕ kaḽa dām̐kĕnā
jāluvāgĕ movim̐dene sari nīvu gūḍam̐gānu
yela śhrīveṁkaḍabadi yĕṁdām̐kā noyi