Sellambo naamana simka siggu vadadu

చెల్లఁబో నామన సింక సిగ్గు వడదు
Language

(॥పల్లవి॥)
చెల్లఁబో నామన సింక సిగ్గు వడదు
పల్లదాన నీకు నేల భ్రమసితినో

(॥చెల్లవో॥)
అడరి నీవు మొక్కఁగా నాపె నిన్నుఁ దిట్టఁ గాను
నడుమ నూరకే నాకు నవ్వు వచ్చెను
వడిఁ జనవు గలట్టివారు ని న్నేమి చేసినా
తడవి నీపై నా కేల దయ వుట్టెనో

(॥చెల్లబో॥)
చెఱఁగు నీవు ముట్టఁగ చేతు లాపె దొబ్బఁ గాను
కఱకుఁ బెంజెమటలు గారీ నాకు
గుఱి యైనవారు నీతో గొడవలు వెట్టుకుంటే
అఱిమఱి నే నేల అడ్డము వచ్చితినో

(॥చెల్ల బో॥)
కాని మ్మని యాపె రాఁగా కాఁగిట నీవు నించఁగా
తానక మై నావలపు తల కెక్కెను
దీనికె కా నన్నుఁ గూడితిని శ్రీవెంటటేశుఁడ
కానీ లే నీ కెంత నేను కైవస మయితినో

(||pallavi||)
sĕllam̐bo nāmana siṁka siggu vaḍadu
palladāna nīgu nela bhramasidino

(||sĕllavo||)
aḍari nīvu mŏkkam̐gā nābĕ ninnum̐ diṭṭam̐ gānu
naḍuma nūrage nāgu navvu vachchĕnu
vaḍim̐ janavu galaṭṭivāru ni nnemi sesinā
taḍavi nībai nā kela daya vuṭṭĕno

(||sĕllabo||)
sĕṟam̐gu nīvu muṭṭam̐ga sedu lābĕ dŏbbam̐ gānu
kaṟagum̐ bĕṁjĕmaḍalu gārī nāgu
guṟi yainavāru nīdo gŏḍavalu vĕṭṭuguṁṭe
aṟimaṟi ne nela aḍḍamu vachchidino

(||sĕlla bo||)
kāni mmani yābĕ rām̐gā kām̐giḍa nīvu niṁcham̐gā
tānaga mai nāvalabu tala kĕkkĕnu
dīnigĕ kā nannum̐ gūḍidini śhrīvĕṁṭaḍeśhum̐ḍa
kānī le nī kĕṁta nenu kaivasa mayidino