Sellambo aamtadaanigi sellunaa yimta

చెల్లఁబో ఆఁటదానికి చెల్లునా యింత
Language

(॥పల్లవి॥)
చెల్లఁబో ఆఁటదానికి చెల్లునా యింత
పల్లదమాడే నాతఁడు పంత మిచ్చినాను

(॥చెల్ల॥)
నగుతా నాడినమాట నలి నెగ్గు సేసుకొని
తెగనాడే విది యేమే తెల్లవారదు
వెగటుఁ గోపము నీకు వెన్నతోడఁ బెట్టి రదె
బిగిసే వాతఁడు నిన్నుఁ బిలిచినా రాకా

(॥చెల్ల॥)
పొలసి చేయి వేసితే చుఱుకనె నంటాను
అలిగి పొయ్యే విదేమే అట్టే లోనికి
చలమే దైవము నీకు సరి నొసల వ్రాసెనా
ములిగే వాతఁడు నీపై మోపము చల్లినను

(॥చెల్ల॥)
బిగ్గఁ గౌఁగిలించుకొంటే పిసికివేసె నంటాను
వొగ్గి మొరవెట్టే వేమే వొద్దివారికి
నిగ్గుల శ్రీవేంకటాద్రినిలయుఁడు నిన్నుఁ గూడె
సిగ్గువడే వాఁతడు నీ చెఱఁగు వట్టినను

(||pallavi||)
sĕllam̐bo ām̐ṭadānigi sĕllunā yiṁta
palladamāḍe nādam̐ḍu paṁta michchinānu

(||sĕlla||)
nagudā nāḍinamāḍa nali nĕggu sesugŏni
tĕganāḍe vidi yeme tĕllavāradu
vĕgaḍum̐ gobamu nīgu vĕnnadoḍam̐ bĕṭṭi radĕ
bigise vādam̐ḍu ninnum̐ bilisinā rāgā

(||sĕlla||)
pŏlasi seyi veside suṟuganĕ naṁṭānu
aligi pŏyye videme aṭṭe lonigi
salame daivamu nīgu sari nŏsala vrāsĕnā
mulige vādam̐ḍu nībai mobamu sallinanu

(||sĕlla||)
biggam̐ gaum̐giliṁchugŏṁṭe pisigivesĕ naṁṭānu
vŏggi mŏravĕṭṭe veme vŏddivārigi
niggula śhrīveṁkaḍādrinilayum̐ḍu ninnum̐ gūḍĕ
sigguvaḍe vām̐taḍu nī sĕṟam̐gu vaṭṭinanu