Sellam bo yimkaanela siggugaadaa

చెల్లఁ బో యింకానేల సిగ్గుగాదా
Language

(॥పల్లవి॥)
చెల్లఁ బో యింకానేల సిగ్గుగాదా
యెల్లవారు నెరిఁగిరి యిఁకనేడ సుద్దులు

(॥చెల్లఁబో॥)
సిరులతోఁ జెఱఁగు మాసినదానిఁ జేరరాకు
సొరిది నల్లంతనుండి చూతువు గాని
వరుస దప్పితే నాడవారిమీఁది యానే సుమ్మీ
యెరవులవారమైతి మిఁకనేడ సుద్దులు

(॥చెల్లఁబో॥)
మాఁటుననున్న దానితో మాటాడకువయ్య నీవు
ఆఁటాదానిచేతనే చెప్పంపుదు గాని,
కూటమికిఁ బెనఁగితే కుచ్చి ఱట్టు సేతు సుమ్మీ
యేఁటికి నవ్వులు నవ్వేవిఁకనేడ సుద్దులు

(॥చెల్లఁబో॥)
చిందువందైనదానిఁ జెనకకువయ్య నీవు
కందువ చెప్పంపి మీఁదఁ గలతు గాని
పొందితి వింతలో నన్నుఁ బోనీక శ్రీ వేంకటేశ
యిందులో నన్నియుఁ గంటిమిఁకనేడ సుద్దులు

(||pallavi||)
sĕllam̐ bo yiṁkānela siggugādā
yĕllavāru nĕrim̐giri yim̐kaneḍa suddulu

(||sĕllam̐bo||)
siruladom̐ jĕṟam̐gu māsinadānim̐ jerarāgu
sŏridi nallaṁtanuṁḍi sūduvu gāni
varusa dappide nāḍavārimīm̐di yāne summī
yĕravulavāramaidi mim̐kaneḍa suddulu

(||sĕllam̐bo||)
mām̐ṭunanunna dānido māḍāḍaguvayya nīvu
ām̐ṭādānisedane sĕppaṁpudu gāni,
kūḍamigim̐ bĕnam̐gide kuchchi ṟaṭṭu sedu summī
yem̐ṭigi navvulu navvevim̐kaneḍa suddulu

(||sĕllam̐bo||)
siṁduvaṁdainadānim̐ jĕnagaguvayya nīvu
kaṁduva sĕppaṁpi mīm̐dam̐ galadu gāni
pŏṁdidi viṁtalo nannum̐ bonīga śhrī veṁkaḍeśha
yiṁdulo nanniyum̐ gaṁṭimim̐kaneḍa suddulu