చెల్లఁ బో యిందుకు నేల చిన్నఁ బోయ్యేవు
(॥పల్లవి॥)
చెల్లఁ బో యిందుకు నేల చిన్నఁ బోయ్యేవు
అల్లాడ నీ కేమైన నది నే నచ్చేరా
(॥చెల్ల బో॥)
సరి నెందు వొయ్యే వంటే సకినాలు వాటించి
తిరిగి తిరిగి వచ్చి తిట్టే వేరా
అరుదు నీ కింతైతే నందు వోయ్యేపనులకు
వెరవుతోడఁ జేటవేలుపులఁ జూడరా
(॥చెల్ల బో॥)
ఆరగించి పొమ్మంటే నదియునుఁ గాని దంటా
గోర సేసి ఆనవెట్టి కోపగించేవు
ఆరయ నీ మనసుకు ననుమాన మైతేను
పోరచి నీ పొరుగునఁ బోచిళ్ళు చల్లరా
(॥చెల్ల బో॥)
వొగి నీకు మొక్కినాను వొకచోటి కేఁగేవేళ
తగ దంటా నీకు నీవే తప్ప నాడేవు
జిగి నన్నుఁ గూడితివి శ్రీవెంకటేశ యిట్టె
పొగరుల నిఁకఁ బోయి పులుగు నర్చించరా
(||pallavi||)
sĕllam̐ bo yiṁdugu nela sinnam̐ boyyevu
allāḍa nī kemaina nadi ne nachcherā
(||sĕlla bo||)
sari nĕṁdu vŏyye vaṁṭe saginālu vāḍiṁchi
tirigi tirigi vachchi tiṭṭe verā
arudu nī kiṁtaide naṁdu voyyebanulagu
vĕravudoḍam̐ jeḍavelubulam̐ jūḍarā
(||sĕlla bo||)
āragiṁchi pŏmmaṁṭe nadiyunum̐ gāni daṁṭā
gora sesi ānavĕṭṭi kobagiṁchevu
āraya nī manasugu nanumāna maidenu
porasi nī pŏrugunam̐ bosiḽḽu sallarā
(||sĕlla bo||)
vŏgi nīgu mŏkkinānu vŏgasoḍi kem̐geveḽa
taga daṁṭā nīgu nīve tappa nāḍevu
jigi nannum̐ gūḍidivi śhrīvĕṁkaḍeśha yiṭṭĕ
pŏgarula nim̐kam̐ boyi pulugu narsiṁcharā