Sellam bo yidemtibani sesidivayyaa

చెల్లఁ బో యిదేఁటిపని సేసితివయ్యా
Language

(॥పల్లవి॥)
చెల్లఁ బో యిదేఁటిపని సేసితివయ్యా - నీ
చిల్లర సుద్దులు విని సిగ్గయ్యీ నాకు

(॥చెల్ల॥)
నవ్వుచుఁ జాళికుఁడు తనాచారి ముడిచి
పువ్వు లెట్టు ముడిచితి పొంది దొరవు
యివ్వల నీసతులెల్లా నెంతకుఁ జొచ్చె ననుచు
చివ్వన నాడఁగ విని సిగ్గయ్యీ నాకు

(॥చెల్ల॥)
నలువంక నాకెమేన నలఁచిన పసుపు, నీ
వెలమి నలఁదుకొంటి వింతవాఁడవు
నలుపు నీ మేని కేలే నగుఁబాటు పస పని
చెలు లాడఁగా విని సిగ్గయ్యీ నాకు

(॥చెల్ల॥)
మట్టు లేని యలమేలుమంగ నేను నీ నాకె
గట్టిన చీరె నాకుఁ గప్పే విదివో
యిట్టె శ్రీవేంకటేశ యిద్దరి మ మ్మొక్కమాటె
చెట్ట వట్టి కూడఁగాను సిగ్గయ్యీ నాకు

(||pallavi||)
sĕllam̐ bo yidem̐ṭibani sesidivayyā - nī
sillara suddulu vini siggayyī nāgu

(||sĕlla||)
navvusum̐ jāḽigum̐ḍu tanāsāri muḍisi
puvvu lĕṭṭu muḍisidi pŏṁdi dŏravu
yivvala nīsadulĕllā nĕṁtagum̐ jŏchchĕ nanusu
sivvana nāḍam̐ga vini siggayyī nāgu

(||sĕlla||)
naluvaṁka nāgĕmena nalam̐sina pasubu, nī
vĕlami nalam̐dugŏṁṭi viṁtavām̐ḍavu
nalubu nī meni kele nagum̐bāḍu pasa pani
sĕlu lāḍam̐gā vini siggayyī nāgu

(||sĕlla||)
maṭṭu leni yalamelumaṁga nenu nī nāgĕ
gaṭṭina sīrĕ nāgum̐ gappe vidivo
yiṭṭĕ śhrīveṁkaḍeśha yiddari ma mmŏkkamāḍĕ
sĕṭṭa vaṭṭi kūḍam̐gānu siggayyī nāgu