చెల్లఁ బో నీ వింత నాకుఁ జెప్ప వలెనా
(॥పల్లవి॥)
చెల్లఁ బో నీ వింత నాకుఁ జెప్ప వలెనా
బల్లిదుఁడ నాకు నీ బలు వుండఁగా
(॥చెల్లబో॥)
సందడించి యవ్వరితో జడగడాలు మా కేల
కందు వై నీవు నాకుఁ గలి గుండఁగా
మందలించి కన్నవారిమాట విన నా కేల
కిందట మీఁదట నీకృప యుండఁగా
(॥చెల్లబో॥)
పొట్టఁబిరుగువారితో పురుఁడు నా కది యేల
యిట్టె నీవు నాకుఁ జన విచ్చి యుండఁగా
వట్టి విచారము లేల వగలఁ బొరల నేల
గుట్టుతో నీబాస నాకు గురి యుండఁగా
(॥చెల్లబో॥)
కడవారితో నింకఁ గాఁతాళము నా కేల
ఆడరి నీకాఁగిలి నన్నంటి యుండఁగా
బడినె శ్రీవెంకటేశ పాయక నన్నుఁ గూడితి
జడియ నేల వలపు సరు లయి వుండఁగా
(||pallavi||)
sĕllam̐ bo nī viṁta nāgum̐ jĕppa valĕnā
ballidum̐ḍa nāgu nī balu vuṁḍam̐gā
(||sĕllabo||)
saṁdaḍiṁchi yavvarido jaḍagaḍālu mā kela
kaṁdu vai nīvu nāgum̐ gali guṁḍam̐gā
maṁdaliṁchi kannavārimāḍa vina nā kela
kiṁdaḍa mīm̐daḍa nīkṛpa yuṁḍam̐gā
(||sĕllabo||)
pŏṭṭam̐biruguvārido purum̐ḍu nā kadi yela
yiṭṭĕ nīvu nāgum̐ jana vichchi yuṁḍam̐gā
vaṭṭi visāramu lela vagalam̐ bŏrala nela
guṭṭudo nībāsa nāgu guri yuṁḍam̐gā
(||sĕllabo||)
kaḍavārido niṁkam̐ gām̐tāḽamu nā kela
āḍari nīgām̐gili nannaṁṭi yuṁḍam̐gā
baḍinĕ śhrīvĕṁkaḍeśha pāyaga nannum̐ gūḍidi
jaḍiya nela valabu saru layi vuṁḍam̐gā