Sellam bo naage suddulu seppaguvayya

చెల్లఁ బో నాకె సుద్దులు చెప్పకువయ్య
Language

(॥పల్లవి॥)
చెల్లఁ బో నాకె సుద్దులు చెప్పకువయ్య
పల్లదాన నీవు నీవే బదుకవయ్యా

(॥చెల్లబో॥)
యేమయ్య నేము నీ కేమిటి కయ్యా
నేమాన నీ కిచ్చ లాడ నేరనయ్యా
చేముంచి యాపె కీ మేలు సేయనయ్యా
మోము చూచి సంతంసించి మొక్కేనయ్యా

(॥చెల్లబో॥)
తలవయ్య మమ్ము నేల తడవేవయ్య
నెలవై నే నిజ మాడి నిష్టూరి నింతే
కెలసి యాకెనె బుజ్జగించవయ్యా
వలచి నే నెపుడు నీ వద్ద నుండే నయ్యా

(॥చెల్లబో॥)
చెల్లు నయ్య యే మైనాఁ జేయవయ్యా
యెల్లవారివలె నేమీ నెరఁగ నయ్యా
కొల్లగా శ్రీవెంకటేశ కూడితివి నన్ను నిట్టె
తెల్లముగ నీ వెంటఁ దిరిగే నయ్యా

(||pallavi||)
sĕllam̐ bo nāgĕ suddulu sĕppaguvayya
palladāna nīvu nīve badugavayyā

(||sĕllabo||)
yemayya nemu nī kemiḍi kayyā
nemāna nī kichcha lāḍa neranayyā
semuṁchi yābĕ kī melu seyanayyā
momu sūsi saṁtaṁsiṁchi mŏkkenayyā

(||sĕllabo||)
talavayya mammu nela taḍavevayya
nĕlavai ne nija māḍi niṣhṭūri niṁte
kĕlasi yāgĕnĕ bujjagiṁchavayyā
valasi ne nĕbuḍu nī vadda nuṁḍe nayyā

(||sĕllabo||)
sĕllu nayya ye mainām̐ jeyavayyā
yĕllavārivalĕ nemī nĕram̐ga nayyā
kŏllagā śhrīvĕṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ
tĕllamuga nī vĕṁṭam̐ dirige nayyā