చెల్లదా నీవేమేమి సేసినా నీకు
(॥పల్లవి॥)
చెల్లదా నీవేమేమి సేసినా నీకు
వెల్లవిరిగా నేల వింతలు సేసేవు
(॥॥)
చీటికిమాటికి నన్ని సేఁతలెల్లా జేసివచ్చి
మాటలెన్ని యాడేవు మాతోడను
నాటకుఁడ నిన్నుఁ జూచి నగితే నాముందరనే
యేఁటికి బాసలు సేసే వింకా నీవు
(॥॥)
వోపిక నీవొళ్ళినేరా లొక్కటొక్కటి యెంచితే
చూపు లేమిచూచేవు సోద్యముగాను
వై పెరిఁగి నేను నీవలపు సోదించితేను
పై పై నన్ను నెంత వొడఁబరచేవు నీవు
(॥॥)
మాఁ గినమోవిమీద మణులెల్లా నించుకొని
కాఁగిట నెట్టు గూడితి కమ్మటి నన్ను
వీగకు శ్రీవేంకటేశ వేఁడుకొని మొక్కితేను
నాఁగువారఁ బొందులెల్లా నడపేవు నీవు
(||pallavi||)
sĕlladā nīvememi sesinā nīgu
vĕllavirigā nela viṁtalu sesevu
(||||)
sīḍigimāḍigi nanni sem̐talĕllā jesivachchi
māḍalĕnni yāḍevu mādoḍanu
nāḍagum̐ḍa ninnum̐ jūsi nagide nāmuṁdarane
yem̐ṭigi bāsalu sese viṁkā nīvu
(||||)
vobiga nīvŏḽḽinerā lŏkkaḍŏkkaḍi yĕṁchide
sūbu lemisūsevu sodyamugānu
vai pĕrim̐gi nenu nīvalabu sodiṁchidenu
pai pai nannu nĕṁta vŏḍam̐barasevu nīvu
(||||)
mām̐ ginamovimīda maṇulĕllā niṁchugŏni
kām̐giḍa nĕṭṭu gūḍidi kammaḍi nannu
vīgagu śhrīveṁkaḍeśha vem̐ḍugŏni mŏkkidenu
nām̐guvāram̐ bŏṁdulĕllā naḍabevu nīvu