చెల్లదా ఆతనికేమి సేసినంతాను
(॥పల్లవి॥)
చెల్లదా ఆతనికేమి సేసినంతాను
వెల్లవిరైన పనికి వెంగె మింత వలెనా
(॥చెల్ల॥)
నగనేలె నీకును నాయ మాతఁడు చెప్పితే
తగవులో నేమైనాఁ దప్పులుండెనా
మగువ లబ్బితేఁజాలు మానలేఁ డింతేకాక
పొగరుఁబదారువేలపూఁతకోక గాఁడా
(॥చెల్ల॥)
తప్పక చూడనేలే తానే సాకిరి చెప్పఁగా
అప్పటి నొలపక్షము లందుండెనా
కప్పురగందులెడల కక్కూరితిపడుఁగాక
కప్పి గొల్లెతలరొంపికంబము దాఁ గాఁడా
(॥చెల్ల॥)
వెరవుతో నిన్నును శ్రీవేంకటేశుఁడు గూడఁగా
సరవు లందేమైనాఁ జాలకుండెనా
తరుణులైతేఁజాలు తగులు మానఁగలేఁడు
ఇరవై మధురలోఁ బెక్కిండ్లవిందు గాఁడా
(||pallavi||)
sĕlladā ādanigemi sesinaṁtānu
vĕllaviraina panigi vĕṁgĕ miṁta valĕnā
(||sĕlla||)
naganelĕ nīgunu nāya mādam̐ḍu sĕppide
tagavulo nemainām̐ dappuluṁḍĕnā
maguva labbidem̐jālu mānalem̐ ḍiṁtegāga
pŏgarum̐badāruvelabūm̐tagoga gām̐ḍā
(||sĕlla||)
tappaga sūḍanele tāne sāgiri sĕppam̐gā
appaḍi nŏlabakṣhamu laṁduṁḍĕnā
kappuragaṁdulĕḍala kakkūridibaḍum̐gāga
kappi gŏllĕdalarŏṁpigaṁbamu dām̐ gām̐ḍā
(||sĕlla||)
vĕravudo ninnunu śhrīveṁkaḍeśhum̐ḍu gūḍam̐gā
saravu laṁdemainām̐ jālaguṁḍĕnā
taruṇulaidem̐jālu tagulu mānam̐galem̐ḍu
iravai madhuralom̐ bĕkkiṁḍlaviṁdu gām̐ḍā