Sellabo yemta kemta sesevu neevu

చెల్లబో యెంత కెంత సేసేవు నీవు
Language

(॥పల్లవి॥)
చెల్లబో యెంత కెంత సేసేవు నీవు
కెల్లురేఁగి నవ్వఁగానే గిలిగింతురా

(॥చెల్లం॥)
చెక్కు నొక్కి సేద దేర్చి చేయిమీఁదఁ జేయి వేసి
చొక్కించితి వింత నతిసులభానను
అక్కరతోఁదనమీఁద నానవెట్టి పాదాలకు
మొక్కఁగానే నీ వాకెమోవి గంటి సేతురా

(॥చెల్లఁ॥)
ముచ్చటాడి వేఁడుకొని మోమున మో మప్పళించి
నెచ్చెలిఁగాఁగిలించితి నేరుపునను
అచ్చమైనజాణ వని యట్టె పొగడి పొగడి
మెచ్చఁగానె పిసికేవు మెలుతకుచములు

(॥చెల్లఁ॥)
కళలంటి రతిఁగూడి కలసి శ్రీవేంకటేశ
చెలఁగించితి వీకెను చేచేతనే
బలు సిగ్గుతోడ నీపచ్చడము గప్పుకొంటా
చెలిమి శాయఁగానే చెనకఁగ నేఁటికి

(||pallavi||)
sĕllabo yĕṁta kĕṁta sesevu nīvu
kĕllurem̐gi navvam̐gāne giligiṁturā

(||sĕllaṁ||)
sĕkku nŏkki seda dersi seyimīm̐dam̐ jeyi vesi
sŏkkiṁchidi viṁta nadisulabhānanu
akkaradom̐danamīm̐da nānavĕṭṭi pādālagu
mŏkkam̐gāne nī vāgĕmovi gaṁṭi sedurā

(||sĕllam̐||)
muchchaḍāḍi vem̐ḍugŏni momuna mo mappaḽiṁchi
nĕchchĕlim̐gām̐giliṁchidi nerubunanu
achchamainajāṇa vani yaṭṭĕ pŏgaḍi pŏgaḍi
mĕchcham̐gānĕ pisigevu mĕludagusamulu

(||sĕllam̐||)
kaḽalaṁṭi radim̐gūḍi kalasi śhrīveṁkaḍeśha
sĕlam̐giṁchidi vīgĕnu sesedane
balu siggudoḍa nībachchaḍamu gappugŏṁṭā
sĕlimi śhāyam̐gāne sĕnagam̐ga nem̐ṭigi