చెలియున్న చందమైతేఁ జెప్పఁగరాదు
(॥పల్లవి॥)
చెలియున్న చందమైతేఁ జెప్పఁగరాదు
నెలకొని యెట్లా మన్నించేవో కాని
(॥చెలి॥)
వేమారు చెలిసుద్దులు విన్నపాలు సేయఁగాను
యేమని వున్నదో చిత్త మెఱఁగమయ్యా
కామిని యంపినయట్టి కానుక నీకిచ్చితిమి
చేముట్టి కైకొంటి వేమిసేసేవో కాని
(॥చెలి॥)
సతికడకు రమ్మని సారె నిన్నుఁ బిలువఁగా
ఇతవు నీకెట్టున్నదో యెఱఁగమయ్యా
అతివమొక్కులు నీకు నప్పగించితి మాపె -
కతలూ వింటి వెప్పుడు గలసేవో కాని
(॥చెలి॥)
గుట్టుతోడ నింతికిఁగాఁ గొచ్చికొచ్చి కొసరఁగా
యెట్టున్నదో నీయెన్నిక యెఱఁగమయ్యా
ఇట్టె శ్రీవేంకటేశ యేలితి వింతలో వచ్చి
చుట్టమ వైతివి యెంత చొక్కేవో కాని
(||pallavi||)
sĕliyunna saṁdamaidem̐ jĕppam̐garādu
nĕlagŏni yĕṭlā manniṁchevo kāni
(||sĕli||)
vemāru sĕlisuddulu vinnabālu seyam̐gānu
yemani vunnado sitta mĕṟam̐gamayyā
kāmini yaṁpinayaṭṭi kānuga nīgichchidimi
semuṭṭi kaigŏṁṭi vemisesevo kāni
(||sĕli||)
sadigaḍagu rammani sārĕ ninnum̐ biluvam̐gā
idavu nīgĕṭṭunnado yĕṟam̐gamayyā
adivamŏkkulu nīgu nappagiṁchidi mābĕ -
kadalū viṁṭi vĕppuḍu galasevo kāni
(||sĕli||)
guṭṭudoḍa niṁtigim̐gām̐ gŏchchigŏchchi kŏsaram̐gā
yĕṭṭunnado nīyĕnniga yĕṟam̐gamayyā
iṭṭĕ śhrīveṁkaḍeśha yelidi viṁtalo vachchi
suṭṭama vaidivi yĕṁta sŏkkevo kāni