చెలియరో యెన్నాళ్లైనాఁ జిన్నదానవా
(॥పల్లవి॥)
చెలియరో యెన్నాళ్లైనాఁ జిన్నదానవా
కలికితనాల మతిఁ గరఁగించవలదా
(॥చెలి॥)
సిగ్గువడేదానిచేతఁ జిక్కునటే మగవాఁడు
యెగ్గువట్టితే వలపు లింపవునటే
అగ్గమై యాతఁ డొసఁగీ నందుకొవే విడెము
వొగ్గి వొద్దఁగూచండవే వొడ్డివట్టీ నతఁడు
(॥చెలి॥)
నాలికత్తైనదానికి ననచునా పొందులు
గొలతనాన నుంటేను కూడుట యెట్టే
మేలములాడీ నతఁడు మేకొని నవ్వఁగదవే
తాలిమిఁ బిసుకవే పాదాలు చాఁచీ నతఁడు
(॥చెలి॥)
యెనలేనిఱట్టడైతే నిచ్చకము వుట్టునా
పెనఁగితే ముచ్చటలు ప్రియములౌనా
అనిశము నిన్నుఁగూడె నలమేల్ మంగవిభుఁడు
వినయాన మొక్కవే శ్రీవేంకటేశుఁ డతఁడు
(||pallavi||)
sĕliyaro yĕnnāḽlainām̐ jinnadānavā
kaligidanāla madim̐ garam̐giṁchavaladā
(||sĕli||)
sigguvaḍedānisedam̐ jikkunaḍe magavām̐ḍu
yĕgguvaṭṭide valabu liṁpavunaḍe
aggamai yādam̐ ḍŏsam̐gī naṁdugŏve viḍĕmu
vŏggi vŏddam̐gūsaṁḍave vŏḍḍivaṭṭī nadam̐ḍu
(||sĕli||)
nāligattainadānigi nanasunā pŏṁdulu
gŏladanāna nuṁṭenu kūḍuḍa yĕṭṭe
melamulāḍī nadam̐ḍu megŏni navvam̐gadave
tālimim̐ bisugave pādālu sām̐sī nadam̐ḍu
(||sĕli||)
yĕnaleniṟaṭṭaḍaide nichchagamu vuṭṭunā
pĕnam̐gide muchchaḍalu priyamulaunā
aniśhamu ninnum̐gūḍĕ nalamel maṁgavibhum̐ḍu
vinayāna mŏkkave śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ḍu