Seliyaro yeedamdinni simtala vaamde

చెలియరో యీతఁడిన్ని చింతల వాఁడే
Language

(॥పల్లవి॥)
చెలియరో యీతఁడిన్ని చింతల వాఁడే
చలివాపి తన మోవిచవులెల్లఁ జూపెనే

(॥॥)
తలవంచుకుండఁగాను తానే నా వొద్దికి వచ్చి
కళ లంటి మొగము చెంగలింపించెనే
పలుకక వుండఁగాను పసగా నన్ను లాలించి
చెలరేఁగించి కతలు చెప్పించుకొనెనే

(॥॥)
సిగ్గువడి వుండఁగాను చెక్కు నొక్కి వేఁడుకొని
వెగ్గళముగా నన్ను నవ్వింపించెనే
తగ్గి దిగువ నుండఁగా దండఁ గూచుండఁ బెట్టుక
వొగ్గించి నోరఁ దమ్ముల మొనరఁగఁ బెట్టేనే

(॥॥)
గుట్టు తో నే నుండఁగాను కోరి శ్రీ వేంకటేశుఁడు
అట్టే నన్నుఁ గౌఁగిలించి దిట్టఁ జేసెనే
నెట్టుకొని మొక్కఁగాను నే నలమేల్మంగ నని
చుట్టరికమునఁ గూడి సొంపు లిట్టే రేఁచెనే.

(||pallavi||)
sĕliyaro yīdam̐ḍinni siṁtala vām̐ḍe
salivābi tana movisavulĕllam̐ jūbĕne

(||||)
talavaṁchuguṁḍam̐gānu tāne nā vŏddigi vachchi
kaḽa laṁṭi mŏgamu sĕṁgaliṁpiṁchĕne
palugaga vuṁḍam̐gānu pasagā nannu lāliṁchi
sĕlarem̐giṁchi kadalu sĕppiṁchugŏnĕne

(||||)
sigguvaḍi vuṁḍam̐gānu sĕkku nŏkki vem̐ḍugŏni
vĕggaḽamugā nannu navviṁpiṁchĕne
taggi diguva nuṁḍam̐gā daṁḍam̐ gūsuṁḍam̐ bĕṭṭuga
vŏggiṁchi noram̐ dammula mŏnaram̐gam̐ bĕṭṭene

(||||)
guṭṭu to ne nuṁḍam̐gānu kori śhrī veṁkaḍeśhum̐ḍu
aṭṭe nannum̐ gaum̐giliṁchi diṭṭam̐ jesĕne
nĕṭṭugŏni mŏkkam̐gānu ne nalamelmaṁga nani
suṭṭarigamunam̐ gūḍi sŏṁpu liṭṭe rem̐sĕne.