చెలియరో రమణుని సేవ లేపొద్దూఁ జేయవే
(॥పల్లవి॥)
చెలియరో రమణుని సేవ లేపొద్దూఁ జేయవే
వలపు లినుమడవును వద్దనే వుండితేను
(॥చెలి॥)
మనసు గలసితే మాటలాడ నింపువుట్టు
తనువులుసోఁకితే తమిరేఁగును
చనవు లొనగూడితే చాలౌను సరసాలు
వినయము గలిగితే వేడుకౌఁ బొందులు
(॥చెలి॥)
తగులాయములై తేను తాలిములు గొనసాగు
మొగమోట లబ్చితేను మోహము నిండు
నగవులు దఱచైతే ననుపులు సతమౌను
తగుచుట్టరికాలైతే దట్టమౌ నాసలు
(॥చెలి॥)
కొలువులు సేసితేను కూరిములు పెరుగును
పలుకులు సమ్మతేతే బలిమౌ రతి
అలమేల్‌మంగవు నీవు అతఁడు శ్రీవేంకటేశుఁ-
డెలమిఁ గూడె నిందే యెసఁగు బోగములు
(||pallavi||)
sĕliyaro ramaṇuni seva lebŏddūm̐ jeyave
valabu linumaḍavunu vaddane vuṁḍidenu
(||sĕli||)
manasu galaside māḍalāḍa niṁpuvuṭṭu
tanuvulusom̐kide tamirem̐gunu
sanavu lŏnagūḍide sālaunu sarasālu
vinayamu galigide veḍugaum̐ bŏṁdulu
(||sĕli||)
tagulāyamulai tenu tālimulu gŏnasāgu
mŏgamoḍa labchidenu mohamu niṁḍu
nagavulu daṟasaide nanubulu sadamaunu
tagusuṭṭarigālaide daṭṭamau nāsalu
(||sĕli||)
kŏluvulu sesidenu kūrimulu pĕrugunu
palugulu sammadede balimau radi
alamelmaṁgavu nīvu adam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍĕlamim̐ gūḍĕ niṁde yĕsam̐gu bogamulu