చెలియరో నీవే కదే సిష్టికర్తవు
(॥పల్లవి॥)
చెలియరో నీవే కదే సిష్టికర్తవు
నిలువున నీ మగఁడు నిను మెచ్చునమ్మా
(॥॥)
బొమ్మల జంకించితేనే పొద్దు గుంకినట్లౌను
కమ్మి నీవు నవ్వితేనే కాయు వెన్నెల
సొమ్మల మోవి చూపితే చుక్కలు నిండుకొనును
నెమ్మది నీరమణుఁడు నిను మెచ్చెనవమ్మా
(॥॥)
పొలిఁతి నీవు చూచితే పొద్దువొడుచు నప్పుడే
పొలయలుకల నెండ పొడచూపును
తిలకించి నిలిచితే దిష్టమౌను లోకమెల్ల
నెలకొని నీవిభుఁడు నిన్ను మెచ్చెనమ్మా
(॥॥)
యెక్కువై నీవు గూడితే నిరుసంజలునుఁ దోఁచు
మొక్కిన నీతురుముకు మూఁగు మేఘాలు
వొక్కటై నీరతులను వోలార్చఁగా నేఁడు
నిక్కి శ్రీవేంకటేశుఁడు నిన్ను మెచ్చెనమ్మా
(||pallavi||)
sĕliyaro nīve kade siṣhṭigardavu
niluvuna nī magam̐ḍu ninu mĕchchunammā
(||||)
bŏmmala jaṁkiṁchidene pŏddu guṁkinaṭlaunu
kammi nīvu navvidene kāyu vĕnnĕla
sŏmmala movi sūbide sukkalu niṁḍugŏnunu
nĕmmadi nīramaṇum̐ḍu ninu mĕchchĕnavammā
(||||)
pŏlim̐ti nīvu sūside pŏdduvŏḍusu nappuḍe
pŏlayalugala nĕṁḍa pŏḍasūbunu
tilagiṁchi niliside diṣhṭamaunu logamĕlla
nĕlagŏni nīvibhum̐ḍu ninnu mĕchchĕnammā
(||||)
yĕkkuvai nīvu gūḍide nirusaṁjalunum̐ dom̐su
mŏkkina nīdurumugu mūm̐gu meghālu
vŏkkaḍai nīradulanu volārsam̐gā nem̐ḍu
nikki śhrīveṁkaḍeśhum̐ḍu ninnu mĕchchĕnammā