Seliyaro nee vemeem jimtimchaguve

చెలియరో నీ వేమీఁ జింతించకువే
Language

(॥పల్లవి॥)
చెలియరో నీ వేమీఁ జింతించకువే
పలుకుఁ బంతాల నీకుఁ బంపు సేయించేనే

(॥॥)
తేరకొన నాతఁడు నా దిక్కు చూచితేఁజాలు
తారుకాణ నొక్కమాటే దక్కఁ గొనేనే
వూరకే పెదవు లెత్తి వొగ్గి మాటాడితేఁ జాలు
దూరు గాకుండా వెంటఁ దోడి తెచ్చేనే

(॥॥)
సేసేటి నా విన్నపాలు చెవులు సోఁకితేఁ జాలు
ఆసల నిన్నుఁ బెండ్లాడేయట్టు సేసేనే
వేసరక యే కాంతాన వేళ యిచ్చితేఁ జాలు
నీ సొమ్ముగా నాతని నేఁడే కావించేనే

(॥॥)
ననిచి నీ చెలినని నాతో నవ్వితేఁజాలు
మనసు నీ పాలు సేసి మరిగించేనే
యెనసి శ్రీ వేంకటేశుఁ డింతలోనె వచ్చి నిన్ను
చనవిచ్చి పాయకుండా జంటసేసేనే

(||pallavi||)
sĕliyaro nī vemīm̐ jiṁtiṁchaguve
palugum̐ baṁtāla nīgum̐ baṁpu seyiṁchene

(||||)
teragŏna nādam̐ḍu nā dikku sūsidem̐jālu
tārugāṇa nŏkkamāḍe dakkam̐ gŏnene
vūrage pĕdavu lĕtti vŏggi māḍāḍidem̐ jālu
dūru gāguṁḍā vĕṁṭam̐ doḍi tĕchchene

(||||)
seseḍi nā vinnabālu sĕvulu som̐kidem̐ jālu
āsala ninnum̐ bĕṁḍlāḍeyaṭṭu sesene
vesaraga ye kāṁtāna veḽa yichchidem̐ jālu
nī sŏmmugā nādani nem̐ḍe kāviṁchene

(||||)
nanisi nī sĕlinani nādo navvidem̐jālu
manasu nī pālu sesi marigiṁchene
yĕnasi śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ vachchi ninnu
sanavichchi pāyaguṁḍā jaṁṭasesene