Seliyaro nee vela simtimcheve

చెలియరో నీ వేల చింతించేవే
Language

(॥పల్లవి॥)
చెలియరో నీ వేల చింతించేవే
వలెనంటే నీ విభుఁడు వచ్చీఁ దా నీడకే

(॥॥)
వలపు గలిగితేను వాడికలూఁ దానే వచ్చు
తలఁపు గలిగితేను తమి రేఁగును
పిలుపు గలిగితేను ప్రియములూఁ బెనగొను
చెలిమి గలిగితేను చేఁతలూ నీడేరును

(॥॥)
మాటలు గలిగితేను మనసులూ సమ్మతించు
కూటమి గలిగితేను కోరిక నిండు
చోటు గలిగిన చోట సొలపులూ నింపౌను
సూటియై రాక గలిగితే సులభమే భోగము

(॥॥)
ననుపు గలిగితేను నవ్వులు చందమౌను
చనవు గలిగితేను చవియౌ మోవి
యెనసీ శ్రీ వేంకటేశుఁడింతలోనే వచ్చి నిన్ను
తనివి గలిగితేను దక్కు నేర్పు లెల్లనూ

(||pallavi||)
sĕliyaro nī vela siṁtiṁcheve
valĕnaṁṭe nī vibhum̐ḍu vachchīm̐ dā nīḍage

(||||)
valabu galigidenu vāḍigalūm̐ dāne vachchu
talam̐pu galigidenu tami rem̐gunu
pilubu galigidenu priyamulūm̐ bĕnagŏnu
sĕlimi galigidenu sem̐talū nīḍerunu

(||||)
māḍalu galigidenu manasulū sammadiṁchu
kūḍami galigidenu koriga niṁḍu
soḍu galigina soḍa sŏlabulū niṁpaunu
sūḍiyai rāga galigide sulabhame bhogamu

(||||)
nanubu galigidenu navvulu saṁdamaunu
sanavu galigidenu saviyau movi
yĕnasī śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone vachchi ninnu
tanivi galigidenu dakku nerbu lĕllanū