చెలియరో నన్ను చెప్పి పొగడుకోఁగాక
(॥పల్లవి॥)
చెలియరో నన్ను చెప్పి పొగడుకోఁగాక
కలికి నా నేరుపెల్లఁ గనుకొనరాదా
(॥చెలి॥)
చూపుల నన్నొకమాటు చూచితేనే చాలుఁగాక
యేపడతులకు మొకమియ్యనిచ్చేనా
దాపై విభుఁడు నేను దగ్గరితేఁ జాలుఁగాక
కోపులకాంతలపొందు కొలుపనిచ్చేనా
(॥చెలి॥)
వూరకే నామాట వాఁడు వూఁకొంటేఁ జాలుఁగాక
వీరివారి విన్నపాలు విననిచ్చేనా
నారుకొన నాతోను నవ్వితేనే చాలుఁగాక
ఆరయ నెందూ సరస మాడనిచ్చేనా
(॥చెలి॥)
సరి నాకాఁగిటఁ జేయిచాఁచితేనే చాలుఁగాక
తరుణుల తలపోఁత తన కిచ్చేనా
ఇరవై శ్రీవేంకటేశుఁ డీవీళ నన్నుఁగూడె
వరుస నెవ్వరికి నే వలవనిచ్చేనా
(||pallavi||)
sĕliyaro nannu sĕppi pŏgaḍugom̐gāga
kaligi nā nerubĕllam̐ ganugŏnarādā
(||sĕli||)
sūbula nannŏgamāḍu sūsidene sālum̐gāga
yebaḍadulagu mŏgamiyyanichchenā
dābai vibhum̐ḍu nenu daggaridem̐ jālum̐gāga
kobulagāṁtalabŏṁdu kŏlubanichchenā
(||sĕli||)
vūrage nāmāḍa vām̐ḍu vūm̐kŏṁṭem̐ jālum̐gāga
vīrivāri vinnabālu vinanichchenā
nārugŏna nādonu navvidene sālum̐gāga
āraya nĕṁdū sarasa māḍanichchenā
(||sĕli||)
sari nāgām̐giḍam̐ jeyisām̐sidene sālum̐gāga
taruṇula talabom̐ta tana kichchenā
iravai śhrīveṁkaḍeśhum̐ ḍīvīḽa nannum̐gūḍĕ
varusa nĕvvarigi ne valavanichchenā