Seliyagu ne nanneem jeppi pampenu

చెలియకు నే నన్నీఁ జెప్పి పంపేను
Language

(॥పల్లవి॥)
చెలియకు నే నన్నీఁ జెప్పి పంపేను
అలయక నీవే యన్నీ నానతియ్యవయ్యా

(॥చెలి॥)
మంతనాన నాపెచేత మాటలెల్లా నాడించే
చెంతల నీమేనెల్లాఁ జెమరింపించే
దొంతినున్న వలపులు దోమటిదొడికింపించె
వింతలేమి సేయవలె వేగ నానతీవయ్యా

(॥చెలి॥)
సేవసేసి నిన్ను నిట్టే సిగ్గులెల్లాఁ బరపించే
పూవులనే వేసి నిన్నుఁ బొసఁగింపించే
లావులఁ బెనఁగి నీమై లచ్చనలు నిండింపించే
కావలసినపని గక్కన నానతీవయ్యా

(॥చెలి॥)
సమరతులను నీజవ్వనము పండింపించే
తమితో మోముకళలు దాకొనిపించే
నెమకి శ్రీవేంకటేశ నేఁడు నన్ను నేలితివి
సముకాన నీయాసలు సారె నానతీవయ్యా

(||pallavi||)
sĕliyagu ne nannīm̐ jĕppi paṁpenu
alayaga nīve yannī nānadiyyavayyā

(||sĕli||)
maṁtanāna nābĕseda māḍalĕllā nāḍiṁche
sĕṁtala nīmenĕllām̐ jĕmariṁpiṁche
dŏṁtinunna valabulu domaḍidŏḍigiṁpiṁchĕ
viṁtalemi seyavalĕ vega nānadīvayyā

(||sĕli||)
sevasesi ninnu niṭṭe siggulĕllām̐ barabiṁche
pūvulane vesi ninnum̐ bŏsam̐giṁpiṁche
lāvulam̐ bĕnam̐gi nīmai lachchanalu niṁḍiṁpiṁche
kāvalasinabani gakkana nānadīvayyā

(||sĕli||)
samaradulanu nījavvanamu paṁḍiṁpiṁche
tamido momugaḽalu dāgŏnibiṁche
nĕmagi śhrīveṁkaḍeśha nem̐ḍu nannu nelidivi
samugāna nīyāsalu sārĕ nānadīvayyā