Seliyaa veguvettuga seppave yaadani raaga

చెలియా వేగువెట్టుక చెప్పవే యాతని రాక
Language

(॥పల్లవి॥)
చెలియా వేగువెట్టుక చెప్పవే యాతని రాక
తలకొని మొక్కితేను దయదలఁచీఁగాక

(॥చెలి॥)
వీది నింత రాఁగాను విభునికి నెదురేఁగి
కైదండ ఇచ్చి తెచ్చి గద్దెపైఁబెట్టి
పాదాలోత్తి విడెమిచ్చిపైపై వేఁడుకొంటేను
పాదుగా నేలుఁగాక నాపలుకేల తోసీనే

(॥చెలి॥)
పల్లకి యెక్కుకరాఁగా పక్కనఁ గానుక యిచ్చి
యిల్లు చూపి విందువెట్టి యేకతానను
చల్లఁగాఁ బానుపువేసి సరి నుపచరించితే
చెల్లించుఁగాక చనవు చిత్తము రాయటవే

(॥చెలి॥)
చెలులు దొడుకరాగా చేరి నేనారతి యెత్తి
లలి దెరవేసి వెవి లంచమిచ్చితే
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
కలసె నన్నిట్టె యిదె కాణాచిగదవే

(||pallavi||)
sĕliyā veguvĕṭṭuga sĕppave yādani rāga
talagŏni mŏkkidenu dayadalam̐sīm̐gāga

(||sĕli||)
vīdi niṁta rām̐gānu vibhunigi nĕdurem̐gi
kaidaṁḍa ichchi tĕchchi gaddĕbaim̐bĕṭṭi
pādālotti viḍĕmichchibaibai vem̐ḍugŏṁṭenu
pādugā nelum̐gāga nābalugela tosīne

(||sĕli||)
pallagi yĕkkugarām̐gā pakkanam̐ gānuga yichchi
yillu sūbi viṁduvĕṭṭi yegadānanu
sallam̐gām̐ bānubuvesi sari nubasariṁchide
sĕlliṁchum̐gāga sanavu sittamu rāyaḍave

(||sĕli||)
sĕlulu dŏḍugarāgā seri nenāradi yĕtti
lali dĕravesi vĕvi laṁchamichchide
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
kalasĕ nanniṭṭĕ yidĕ kāṇāsigadave