చెలియా మరి నాకుఁ జెప్పవే బుద్ది
(॥పల్లవి॥)
చెలియా మరి నాకుఁ జెప్పవే బుద్ది
వలపుల మొదలనే వలరాజున్నాఁడు
(॥చెలి॥)
చెలఁగి నావిన్నపము చిత్తాన నున్నదో లేదో
తలఁపించి రాఁగదవే తగువిభుని
వెలి నేడ నున్న వాఁడో వేళ యెటువంటిదో
తెలిసి నీవు వచ్చితే తేరీని పనులు
(॥చెలి॥)
ఆయమైన నాగుఱతు లంగాన నున్నవో లేవో
చాయలఁజూపు మనవే సరసునిని
యీయెడ కెపుడు వచ్చీ నేమనున్నదో గుణము
నాయాననే సోదించితే ననిచీని పనులు
(॥చెలి॥)
అదివో వాకిటికిఁ దా నట్టె వచ్చినాఁడో లేదో
యెదురుకోవే నీవు ఇంతలోననే
అదన శ్రీ వేంకటేశుఁడాతఁడే విచ్చేసి కూడె
పొదిగి పాయకుండితే పొసఁగీని పనులు
(||pallavi||)
sĕliyā mari nāgum̐ jĕppave buddi
valabula mŏdalane valarājunnām̐ḍu
(||sĕli||)
sĕlam̐gi nāvinnabamu sittāna nunnado ledo
talam̐piṁchi rām̐gadave taguvibhuni
vĕli neḍa nunna vām̐ḍo veḽa yĕḍuvaṁṭido
tĕlisi nīvu vachchide terīni panulu
(||sĕli||)
āyamaina nāguṟadu laṁgāna nunnavo levo
sāyalam̐jūbu manave sarasunini
yīyĕḍa kĕbuḍu vachchī nemanunnado guṇamu
nāyānane sodiṁchide nanisīni panulu
(||sĕli||)
adivo vāgiḍigim̐ dā naṭṭĕ vachchinām̐ḍo ledo
yĕdurugove nīvu iṁtalonane
adana śhrī veṁkaḍeśhum̐ḍādam̐ḍe vichchesi kūḍĕ
pŏdigi pāyaguṁḍide pŏsam̐gīni panulu