చెలియా మఱవకువే చెప్పితి బుద్ది
(॥పల్లవి॥)
చెలియా మఱవకువే చెప్పితి బుద్ది
తొలుతే గాలిగలట్టే తూరుపెత్తుమందురు
(॥చెలి॥)
బత్తితో నీరమణుఁడు పానుపుపై నున్నవాఁడు
చిత్తమురా విన్నపాలు సేసుకొనవే
హత్తినితో సమేళమై యిప్పుడున్నవాఁడు
గుత్తపుగుబ్బల నొత్తి కొసరఁగఁగదవే
(॥చెలి॥)
ననిచి నీమోము చూచి నవ్వుతానే వున్నవాఁడు
చెనకి యేపనులైనాఁ జేయించుకోవే
కనుఁగొని నీమీఁదివే కన్నులై తా నున్నవాఁడు
పెనఁగి తమ్ముల మిట్టె పెట్టించుకోఁగదవే
(॥చెలి॥)
మరగి నీతోడుతనే మాటలాడుతా నున్నాఁడు
యెరపు లేకుండా వరమిప్పించుకోవే
ఇరవై నిన్నేలి చనవిచ్చి నీకు తా నున్నాఁడు
నిరుగ శ్రీవేంకటేశు సారె మెప్పించఁగదే
(||pallavi||)
sĕliyā maṟavaguve sĕppidi buddi
tŏlude gāligalaṭṭe tūrubĕttumaṁduru
(||sĕli||)
battido nīramaṇum̐ḍu pānububai nunnavām̐ḍu
sittamurā vinnabālu sesugŏnave
hattinido sameḽamai yippuḍunnavām̐ḍu
guttabugubbala nŏtti kŏsaram̐gam̐gadave
(||sĕli||)
nanisi nīmomu sūsi navvudāne vunnavām̐ḍu
sĕnagi yebanulainām̐ jeyiṁchugove
kanum̐gŏni nīmīm̐dive kannulai tā nunnavām̐ḍu
pĕnam̐gi tammula miṭṭĕ pĕṭṭiṁchugom̐gadave
(||sĕli||)
maragi nīdoḍudane māḍalāḍudā nunnām̐ḍu
yĕrabu leguṁḍā varamippiṁchugove
iravai ninneli sanavichchi nīgu tā nunnām̐ḍu
niruga śhrīveṁkaḍeśhu sārĕ mĕppiṁcham̐gade