చెలియ వేడుక నీవు చెల్లించవయ్యా
(॥పల్లవి॥)
చెలియ వేడుక నీవు చెల్లించవయ్యా
తలఁచినట్లనే తమకించవయ్యా
(॥చెలి॥)
చెలరేఁగి చెలరేఁగి చెప్పీనామె మాటలెల్ల
వెలయఁగ నిచ్చగించ వినవయ్యా
సొలసి సొలసి నిన్నుఁ జూచీ తప్పక యిట్టె
నిలువున యెదుటనే నిలుచుండవయ్యా
(॥చెలి॥)
కడఁగి కడఁగి నీకుఁ గానుకలిచ్చీనాపె
అడరి యెదురుకొని అందుకోవయ్యా
కడు నప్పటి నిన్ను గాతలుగాఁ జెనకీని
చిడుముడితో నన్నీఁ జేయించుకోవయ్యా
(॥చెలి॥)
వొద్దనుండి వొద్దనుండి వూడిగాలు సేసీనాపె
పొద్దువొద్దునను నీవు బోగించవయ్యా
తిద్దుక ఆపెను నన్నుఁ దేకువతో నేలితిరి
గద్దరి శ్రీవేంకటేశ కరుణించవయ్యా
(||pallavi||)
sĕliya veḍuga nīvu sĕlliṁchavayyā
talam̐sinaṭlane tamagiṁchavayyā
(||sĕli||)
sĕlarem̐gi sĕlarem̐gi sĕppīnāmĕ māḍalĕlla
vĕlayam̐ga nichchagiṁcha vinavayyā
sŏlasi sŏlasi ninnum̐ jūsī tappaga yiṭṭĕ
niluvuna yĕduḍane nilusuṁḍavayyā
(||sĕli||)
kaḍam̐gi kaḍam̐gi nīgum̐ gānugalichchīnābĕ
aḍari yĕdurugŏni aṁdugovayyā
kaḍu nappaḍi ninnu gādalugām̐ jĕnagīni
siḍumuḍido nannīm̐ jeyiṁchugovayyā
(||sĕli||)
vŏddanuṁḍi vŏddanuṁḍi vūḍigālu sesīnābĕ
pŏdduvŏddunanu nīvu bogiṁchavayyā
tidduga ābĕnu nannum̐ deguvado nelidiri
gaddari śhrīveṁkaḍeśha karuṇiṁchavayyā