Seliya sitta meṟimgi seyavayyaa atte neevu

చెలియ చిత్త మెఱిఁగి సేయవయ్యా అట్టే నీవు
Language

(॥పల్లవి॥)
చెలియ చిత్త మెఱిఁగి సేయవయ్యా అట్టే నీవు
నలరు జాణఁడవు నీ కాకెకునే తగును

(॥చెలియ॥)
కాంత నీతో సన్నచేసి కన్నులకాటికె చూపె
రంతు మాని నిన్ను రాత్రి రమ్మనఁ బోలు
కాంతులచెంపలమీఁదిగందము నలఁచి వేసె
వంత నిక్కువ సింగారవనము గాఁబోలును

(॥చెలియ॥)
తరుణి సన్నలు సేసి తామెరలు ముడిచెను
అరయ పద్మినీజాతి ననఁ బోలును
సరుగఁ జెమటనీరు సారె గోరఁ జిమ్మె నదే
యిరవై తొలఁగి నాల్నాళ్ళిటు సేయఁబోలును

(॥చెలియ॥)
ఆరయ నింత కంటహర మిదె కట్టుకొనె
హరమై తా నీకు నుండె ననఁబోలును
యీరీతి శ్రీవేంకటేశుఁ డింత సేసి నిన్నుఁ గూడె
గారవపు శ్రీరమణి గాఁబోలును

(||pallavi||)
sĕliya sitta mĕṟim̐gi seyavayyā aṭṭe nīvu
nalaru jāṇam̐ḍavu nī kāgĕgune tagunu

(||sĕliya||)
kāṁta nīdo sannasesi kannulagāḍigĕ sūbĕ
raṁtu māni ninnu rātri rammanam̐ bolu
kāṁtulasĕṁpalamīm̐digaṁdamu nalam̐si vesĕ
vaṁta nikkuva siṁgāravanamu gām̐bolunu

(||sĕliya||)
taruṇi sannalu sesi tāmĕralu muḍisĕnu
araya padminījādi nanam̐ bolunu
sarugam̐ jĕmaḍanīru sārĕ goram̐ jimmĕ nade
yiravai tŏlam̐gi nālnāḽḽiḍu seyam̐bolunu

(||sĕliya||)
āraya niṁta kaṁṭahara midĕ kaṭṭugŏnĕ
haramai tā nīgu nuṁḍĕ nanam̐bolunu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍiṁta sesi ninnum̐ gūḍĕ
gāravabu śhrīramaṇi gām̐bolunu