చెలియ సేసే సేవ చిత్తగించవయ్యా
(॥పల్లవి॥)
చెలియ సేసే సేవ చిత్తగించవయ్యా
వెలయ నా మోము చూచి వెస నెంతనవ్వేవు
(॥చెలి॥)
యింతి నీకు మోహముతో నెదురులుచూడఁగాను
పంతముతో నేమాడేవు పగడసాల
దొంతివెట్టు కక్కడ విందులు నీకుఁ జేయఁగాను
సంతసతులతో నేమిసరసాలాడేవు
(॥చెలి॥)
లలి నిన్నుఁ బెండ్లాడ లగ్నము వెట్టుకుండఁగ
వొలిపి యేమివినేవు వూరఁగతులు
అలరి నీరాకలకు నారతి వట్టుకుండఁగ
చలపట్టి గరడీలో సాము లెంత సేసేవు
(॥చెలి॥)
ఇంటిలో నలమేల్‌మంగ ఇట్టె నిన్ను రమ్మనఁగా
నంటున నేమిచూచేవు నాటకసాల
జంటై కూడితి వింతలో సరుగ శ్రీవేంకటేశ
గొంటరివై యాపెవీణె గొర నేమిమీటేవు
(||pallavi||)
sĕliya sese seva sittagiṁchavayyā
vĕlaya nā momu sūsi vĕsa nĕṁtanavvevu
(||sĕli||)
yiṁti nīgu mohamudo nĕdurulusūḍam̐gānu
paṁtamudo nemāḍevu pagaḍasāla
dŏṁtivĕṭṭu kakkaḍa viṁdulu nīgum̐ jeyam̐gānu
saṁtasadulado nemisarasālāḍevu
(||sĕli||)
lali ninnum̐ bĕṁḍlāḍa lagnamu vĕṭṭuguṁḍam̐ga
vŏlibi yemivinevu vūram̐gadulu
alari nīrāgalagu nāradi vaṭṭuguṁḍam̐ga
salabaṭṭi garaḍīlo sāmu lĕṁta sesevu
(||sĕli||)
iṁṭilo nalamelmaṁga iṭṭĕ ninnu rammanam̐gā
naṁṭuna nemisūsevu nāḍagasāla
jaṁṭai kūḍidi viṁtalo saruga śhrīveṁkaḍeśha
gŏṁṭarivai yābĕvīṇĕ gŏra nemimīḍevu