Seliya praananaatha naagum jeppa nemi maabudaamka

చెలియ ప్రాణనాథ నాకుఁ జెప్ప నేమి మాపుదాఁక
Language

(॥పల్లవి॥)
చెలియ ప్రాణనాథ నాకుఁ జెప్ప నేమి మాపుదాఁక
తలఁపు దలఁపు నేకమాయి తమక మింక నిదె పో

(॥చెలియ॥)
ఆయ మెఱింగి మాటలాడి అతివమనము గరఁచె
కాయ మంటి కళలు రేఁచుకడమ నీదే పో
చాయ చూపి చనవు లిచ్చి సరవు లెల్ల నీకు నడపె
చేయి చాఁచి కౌగిలించుచేఁత యింక నిదె పో

(॥చెలియ॥)
వేళెఱింగి నవ్వు నవ్వి వెలఁది నిన్ను మరుగఁ జేసె
తాలి మలరఁ జెక్కు నొక్కు తగవు నీదె పో
కేలు గేలఁ గీలుకొలిపి కెరలి యాకె ప్రియము చెప్పె
మేలు చూచి యాగుణములు మెచ్చవలయు నీవె పో

(॥చెలియ॥)
చవి యెఱింగి సరసమాడి సకియ నీదుమీదఁనెరగె
యివల రతులఁ దనుపవలయునెఱుక నీదె పో
జవళి శ్రీవేంకటేశ సరుగ నాపె నిన్నుఁ గూడె
తివిరి యాకెయలపు దీర్చుతెలివి యెల్ల నీదె పో

(||pallavi||)
sĕliya prāṇanātha nāgum̐ jĕppa nemi mābudām̐ka
talam̐pu dalam̐pu negamāyi tamaga miṁka nidĕ po

(||sĕliya||)
āya mĕṟiṁgi māḍalāḍi adivamanamu garam̐sĕ
kāya maṁṭi kaḽalu rem̐sugaḍama nīde po
sāya sūbi sanavu lichchi saravu lĕlla nīgu naḍabĕ
seyi sām̐si kaugiliṁchusem̐ta yiṁka nidĕ po

(||sĕliya||)
veḽĕṟiṁgi navvu navvi vĕlam̐di ninnu marugam̐ jesĕ
tāli malaram̐ jĕkku nŏkku tagavu nīdĕ po
kelu gelam̐ gīlugŏlibi kĕrali yāgĕ priyamu sĕppĕ
melu sūsi yāguṇamulu mĕchchavalayu nīvĕ po

(||sĕliya||)
savi yĕṟiṁgi sarasamāḍi sagiya nīdumīdam̐nĕragĕ
yivala radulam̐ danubavalayunĕṟuga nīdĕ po
javaḽi śhrīveṁkaḍeśha saruga nābĕ ninnum̐ gūḍĕ
tiviri yāgĕyalabu dīrsudĕlivi yĕlla nīdĕ po