చెలియ నీవెన్నాళ్లైనాఁ జిన్నదానవా
(॥పల్లవి॥)
చెలియ నీవెన్నాళ్లైనాఁ జిన్నదానవా
మలసి నీ మగనితో మాటలాడఁ గదవే
(॥చెలి॥)
మిక్కిలి నీచన్నులు మీఁదమీఁదఁ బెరుగఁగా
గక్కనఁ బయ్యదనేల కప్పిపెట్టేవే
తక్కక నీజవ్వనము తతి గొనసాగఁగాను
చెక్కిటి చేతితోనేల సిగ్గులువడేవే
(॥చెలి॥)
ముట్టి మదనకళలు మోమున నిండఁగాను
యిట్టె చేతిమాటున నేమిసేసేవే
దట్టమైనవలపులు తలఁపులో నుండఁగాను
నట్టనడు మఁదరలో నవ్వులేమినవ్వేవే
(॥చెలి॥)
చొప్పులెత్తి తమకము చూపులనే కానరాఁగా
చిప్పిలుఁ జెమట నంత చిమ్మిరేఁగేవే
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
ముప్పిరిఁ గూడితి రింకా మూసి మంతనమేలే
(||pallavi||)
sĕliya nīvĕnnāḽlainām̐ jinnadānavā
malasi nī maganido māḍalāḍam̐ gadave
(||sĕli||)
mikkili nīsannulu mīm̐damīm̐dam̐ bĕrugam̐gā
gakkanam̐ bayyadanela kappibĕṭṭeve
takkaga nījavvanamu tadi gŏnasāgam̐gānu
sĕkkiḍi sedidonela sigguluvaḍeve
(||sĕli||)
muṭṭi madanagaḽalu momuna niṁḍam̐gānu
yiṭṭĕ sedimāḍuna nemiseseve
daṭṭamainavalabulu talam̐pulo nuṁḍam̐gānu
naṭṭanaḍu mam̐daralo navvuleminavveve
(||sĕli||)
sŏppulĕtti tamagamu sūbulane kānarām̐gā
sippilum̐ jĕmaḍa naṁta simmirem̐geve
appam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
muppirim̐ gūḍidi riṁkā mūsi maṁtanamele