చెలియ నీవడుగఁగాఁ జెప్పే నేను
(॥పల్లవి॥)
చెలియ నీవడుగఁగాఁ జెప్పే నేను
సలిగె నాకిచ్చినాఁడు సంతతమునమ్మా
(॥చెలి॥)
కన్నులఁగన్నప్పుడెల్లా కరుణించు నన్నాతఁడు
సన్నలనే మోవితేనె చవిచూపును
విన్నపాలేమి సేసినా వేడుకతోనే విను
పన్ని నాపై నామగఁడు బత్తిగలఁ డోయమ్మా
(॥చెలి॥)
అందరిలోనా నన్ను నాదరించు నేపొద్దు
ముందుముందే పుక్కిటితముల మిడును
అంది నే నెంతనవ్వినా నాసతోనే చిత్తగించు
కందువనాపతి నాకుఁ గడుమేలువాఁడమ్మ
(॥చెలి॥)
పలుమారు నాచేతఁ బాదాలొత్తించుకొను
లలి గుబ్బల నూఁదితే లాలించును
యెలమి శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
తలఁచి నాకాఁగిటనే తగులైనవాఁడమ్మా
(||pallavi||)
sĕliya nīvaḍugam̐gām̐ jĕppe nenu
saligĕ nāgichchinām̐ḍu saṁtadamunammā
(||sĕli||)
kannulam̐gannappuḍĕllā karuṇiṁchu nannādam̐ḍu
sannalane movidenĕ savisūbunu
vinnabālemi sesinā veḍugadone vinu
panni nābai nāmagam̐ḍu battigalam̐ ḍoyammā
(||sĕli||)
aṁdarilonā nannu nādariṁchu nebŏddu
muṁdumuṁde pukkiḍidamula miḍunu
aṁdi ne nĕṁtanavvinā nāsadone sittagiṁchu
kaṁduvanābadi nāgum̐ gaḍumeluvām̐ḍamma
(||sĕli||)
palumāru nāsedam̐ bādālŏttiṁchugŏnu
lali gubbala nūm̐dide lāliṁchunu
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
talam̐si nāgām̐giḍane tagulainavām̐ḍammā