Seliya naa vinnabaalu sittaanam bettumanave

చెలియ నా విన్నపాలు చిత్తానఁ బెట్టుమనవే
Language

(॥పల్లవి॥)
చెలియ నా విన్నపాలు చిత్తానఁ బెట్టుమనవే
మలసి న న్నేకాలమూ మన్నించుమనవే

(॥చెలి॥)
యిచ్చక మాడుదుఁగాని యేమిటా వెంగెములాడ
కొచ్చి కొసరుదుఁగాని కోపగించను
పచ్చిగి నవ్వుదుఁగాని పంతములు నెరపను
తచ్చి తచ్చి నా గుణాలు తా నెరుఁగుననవే

(॥చెలి॥)
వాడిక చూపుదుఁగాని వాసి వంతు లెంచను
వేడుకలు వెంతుఁగాని వేసారను
వూడిగాలు సేతుఁగాని వుదుటున జంకించను
యీడు జోడైన నా బత్తి యెంచిచూడుమనవే

(॥చెలి॥)
చేరి కాఁగిలింతుఁగాని సిగ్గులు మరఁగుసేయ
గారవింతుఁగాని మరి గయ్యాళించను
యీరీతి శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
తారుకాణగా నన్నేలె తలఁచుకొమ్మనవే

(||pallavi||)
sĕliya nā vinnabālu sittānam̐ bĕṭṭumanave
malasi na nnegālamū manniṁchumanave

(||sĕli||)
yichchaga māḍudum̐gāni yemiḍā vĕṁgĕmulāḍa
kŏchchi kŏsarudum̐gāni kobagiṁchanu
pachchigi navvudum̐gāni paṁtamulu nĕrabanu
tachchi tachchi nā guṇālu tā nĕrum̐gunanave

(||sĕli||)
vāḍiga sūbudum̐gāni vāsi vaṁtu lĕṁchanu
veḍugalu vĕṁtum̐gāni vesāranu
vūḍigālu sedum̐gāni vuduḍuna jaṁkiṁchanu
yīḍu joḍaina nā batti yĕṁchisūḍumanave

(||sĕli||)
seri kām̐giliṁtum̐gāni siggulu maram̐guseya
gāraviṁtum̐gāni mari gayyāḽiṁchanu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
tārugāṇagā nannelĕ talam̐sugŏmmanave