చెలియ మోహము నీకుఁ జెప్పఁగ నలవిగాదు
(॥పల్లవి॥)
చెలియ మోహము నీకుఁ జెప్పఁగ నలవిగాదు
మలసి నీవే యెఱిఁగి మన్నించుమిఁకను
(॥చెలి॥)
యెదురుచూచు నీకు యింతి నీ సుద్దులడుగు
వుదుటుఁ గోరికలతో నున్విళ్ళూరును
మదిలోనఁ దలపోసు మచ్చికతోఁ జెమరించు
పెదవులఁ దేనెలూరఁ బేరుకొని పిలుచు
(॥చెలి॥)
ఆలకించు నీమాటలు ఆసలు దనలో నించు
వేళ గాచుకొని వుండు వేడుకతోను
మేలుదై దాఁ బొగడు నీమీఁది పదములు వాడు
చాలుకొని నీరాకకు సకినాలు చూచును
(॥చెలి॥)
చేతులెత్తి నీకు మొక్కు సేసచల్లఁ దమకించు
కాత రించలమేల్మంగ కళలు రేఁగు
యాతల శ్రీవేంకటేస యేలితి వింతలో వచ్చి
రాతిరిఁ బగలు నీ రతులెల్లా మెచ్చును
(||pallavi||)
sĕliya mohamu nīgum̐ jĕppam̐ga nalavigādu
malasi nīve yĕṟim̐gi manniṁchumim̐kanu
(||sĕli||)
yĕdurusūsu nīgu yiṁti nī suddulaḍugu
vuduḍum̐ gorigalado nunviḽḽūrunu
madilonam̐ dalabosu machchigadom̐ jĕmariṁchu
pĕdavulam̐ denĕlūram̐ berugŏni pilusu
(||sĕli||)
ālagiṁchu nīmāḍalu āsalu danalo niṁchu
veḽa gāsugŏni vuṁḍu veḍugadonu
meludai dām̐ bŏgaḍu nīmīm̐di padamulu vāḍu
sālugŏni nīrāgagu saginālu sūsunu
(||sĕli||)
sedulĕtti nīgu mŏkku sesasallam̐ damagiṁchu
kāda riṁchalamelmaṁga kaḽalu rem̐gu
yādala śhrīveṁkaḍesa yelidi viṁtalo vachchi
rādirim̐ bagalu nī radulĕllā mĕchchunu