చెలియ మేనే నీకు సింగారపుఁ దోఁటాయ
(॥పల్లవి॥)
చెలియ మేనే నీకు సింగారపుఁ దోఁటాయ
యెలమితో వినోదింతు విప్పుడిట్టె రావయ్య
(॥॥)
వేసవియండలు గాసె వెలఁదివిరహమున
వాసికెక్కఁ జెమటలవాన గురిసె
మోసులెత్తేపులకలుఁ మోలచెఁ బైరులెల్ల
యీసతినీమనోరాజ్య మేలుదువు రావయ్య
(॥॥)
కమ్మటిచన్నుల నారికచమపుఁ గాయలు గాచె
పమ్మి మోవితేనెల పంటలు వండెను
వుమ్మగిలునూరుపుల నొనరె నాయిటిగాలి
తమ్మికంటిజవ్వనపుఁదతి వచ్చె రావయ్య
(॥॥)
మఱి తోఁగిచూపుల మంచిచంద్రోదయమాయ
నెఱయ నవ్వులనేవెన్నెల గాసెను
యెఱిఁగి శ్రీ వేంకటేశ యిటు వచ్చి కూడితిని
తెఱవ నేలఁగ దినదినము రావయ్య
(||pallavi||)
sĕliya mene nīgu siṁgārabum̐ dom̐ṭāya
yĕlamido vinodiṁtu vippuḍiṭṭĕ rāvayya
(||||)
vesaviyaṁḍalu gāsĕ vĕlam̐divirahamuna
vāsigĕkkam̐ jĕmaḍalavāna gurisĕ
mosulĕttebulagalum̐ molasĕm̐ bairulĕlla
yīsadinīmanorājya meluduvu rāvayya
(||||)
kammaḍisannula nārigasamabum̐ gāyalu gāsĕ
pammi movidenĕla paṁṭalu vaṁḍĕnu
vummagilunūrubula nŏnarĕ nāyiḍigāli
tammigaṁṭijavvanabum̐dadi vachchĕ rāvayya
(||||)
maṟi tom̐gisūbula maṁchisaṁdrodayamāya
nĕṟaya navvulanevĕnnĕla gāsĕnu
yĕṟim̐gi śhrī veṁkaḍeśha yiḍu vachchi kūḍidini
tĕṟava nelam̐ga dinadinamu rāvayya