Seliya daane ninnum jeravachchenu

చెలియ దానే నిన్నుఁ జేరవచ్చెను
Language

(॥పల్లవి॥)
చెలియ దానే నిన్నుఁ జేరవచ్చెను
బలువుఁడ వౌదువు పంతగాఁడ వౌదువు

(॥చెలి॥)
దవ్వులమండిననిన్ను దగ్గర రమ్మనుచును
జవ్వని పువ్వుల వేసి సన్న సేసెను
అవ్వల నీవే మరుసమ్ములంటా నొడ్డుకొని
పవ్వళించే విట్టే యింతీవానుపుమీఁదను

(॥చెలి॥)
ఆకడిమోమైనవిన్ను నట్టె తన్నుఁ జూడుమని
యీకాంత కప్రాన వేసి యెచ్చరించెను
మేకొన చంద్రుని చలిమణుఁగురులని తోసి
చేకొని చంద్రగావిచీర గప్పకొంటివి

(॥చెలి॥)
భ్రమసివుండిన నిన్నుఁ బట్టి తన్నుఁ గూడుమని
గుమితాన నవ్వు నవ్వి గోర నూఁదెను
నెమకి శ్రీవేంకటేశ నీభాగ్యచిహ్నలని
కమలాక్షి రతుల గక్కఁన గూడితివి

(||pallavi||)
sĕliya dāne ninnum̐ jeravachchĕnu
baluvum̐ḍa vauduvu paṁtagām̐ḍa vauduvu

(||sĕli||)
davvulamaṁḍinaninnu daggara rammanusunu
javvani puvvula vesi sanna sesĕnu
avvala nīve marusammulaṁṭā nŏḍḍugŏni
pavvaḽiṁche viṭṭe yiṁtīvānubumīm̐danu

(||sĕli||)
āgaḍimomainavinnu naṭṭĕ tannum̐ jūḍumani
yīgāṁta kaprāna vesi yĕchchariṁchĕnu
megŏna saṁdruni salimaṇum̐gurulani tosi
segŏni saṁdragāvisīra gappagŏṁṭivi

(||sĕli||)
bhramasivuṁḍina ninnum̐ baṭṭi tannum̐ gūḍumani
gumidāna navvu navvi gora nūm̐dĕnu
nĕmagi śhrīveṁkaḍeśha nībhāgyasihnalani
kamalākṣhi radula gakkam̐na gūḍidivi