Seliya bhaavamu soodam jeppam gottalu

చెలియ భావము చూడఁ జెప్పఁ గొత్తలు
Language

(॥పల్లవి॥)
చెలియ భావము చూడఁ జెప్పఁ గొత్తలు
యెలమి నీ వేలవయ్య యెంత పొగడేము

(॥॥)
నిండిన తమక మెల్లా నిలువునఁ దొట్టఁగాను
దండి తరితీపులు తమి రేఁచఁగా
కొండల వంటి చన్నులు కొనసాగి పెరుగఁగా
మెండగు వయసు నీకు మీఁదెత్తు కున్నది

(॥॥)
తలపోఁతలు మదిలోఁ దడఁబడుచుండఁ గాను
చెలపచెమటలు పైఁ జిప్పిలఁ గాను
కలికి చూపుల కాంక్ష కడు సందడించఁగాను
వలపు నీకుఁ గాను కవడిఁ బట్టుకున్నది

(॥॥)
కోటానఁ గోటి కోర్కులు కుప్పలుగఁ బడఁగాను
మాటలు పెదవులపై మల్లాడఁగాను
నీటున శ్రీ వేంకటేశ నీ వేలితి వింతలోన
కూటపు రతులు నీకు గుఱిసేసుకున్నది

(||pallavi||)
sĕliya bhāvamu sūḍam̐ jĕppam̐ gŏttalu
yĕlami nī velavayya yĕṁta pŏgaḍemu

(||||)
niṁḍina tamaga mĕllā niluvunam̐ dŏṭṭam̐gānu
daṁḍi taridībulu tami rem̐sam̐gā
kŏṁḍala vaṁṭi sannulu kŏnasāgi pĕrugam̐gā
mĕṁḍagu vayasu nīgu mīm̐dĕttu kunnadi

(||||)
talabom̐talu madilom̐ daḍam̐baḍusuṁḍam̐ gānu
sĕlabasĕmaḍalu paim̐ jippilam̐ gānu
kaligi sūbula kāṁkṣha kaḍu saṁdaḍiṁcham̐gānu
valabu nīgum̐ gānu kavaḍim̐ baṭṭugunnadi

(||||)
koḍānam̐ goḍi korgulu kuppalugam̐ baḍam̐gānu
māḍalu pĕdavulabai mallāḍam̐gānu
nīḍuna śhrī veṁkaḍeśha nī velidi viṁtalona
kūḍabu radulu nīgu guṟisesugunnadi