Selivai puttidenemi siggu gomta valadaa

చెలివై పుట్టితేనేమి సిగ్గు గొంత వలదా
Language

(॥పల్లవి॥)
చెలివై పుట్టితేనేమి సిగ్గు గొంత వలదా
పిలువని పేరటము పిరి దూరి వత్తురా

(॥చెలి॥)
పంగించి నా కాఁగిటిలో పతితో నేల నవ్వేవే
యెంగిలి రతులకు నీవేల లాచేవే
ముంగిట నితఁడు నా మోవితేనె లానినాఁడు
చెంగట నట్టిమాఁటకు చెవి యే లొగ్గేవే

(॥చెలి॥)
వేల నామట్టె లుండఁగా విభునేల పట్టేవే
కూళతనములకేల కొంగు లొడ్డేవే
తాలిమి నా చెమటల దడిసి తా నున్నాఁడు
యీలీలఁ బెనఁగులాట కెట్టు వచ్చేవే

(॥చెలి॥)
తొడపై శ్రీవేంకటేశుతో నేమి పొందు సేసేవే
వొడఁబడని మేలెల్ల వొడిఁగట్టేవే
అడరి నీ కొప్పు పువ్వులందునే పూజగొన్నాఁడు
బడినే యీ వలపేల పైఁ జల్లుకొనేవే

(||pallavi||)
sĕlivai puṭṭidenemi siggu gŏṁta valadā
piluvani peraḍamu piri dūri vatturā

(||sĕli||)
paṁgiṁchi nā kām̐giḍilo padido nela navveve
yĕṁgili radulagu nīvela lāseve
muṁgiḍa nidam̐ḍu nā movidenĕ lāninām̐ḍu
sĕṁgaḍa naṭṭimām̐ṭagu sĕvi ye lŏggeve

(||sĕli||)
vela nāmaṭṭĕ luṁḍam̐gā vibhunela paṭṭeve
kūḽadanamulagela kŏṁgu lŏḍḍeve
tālimi nā sĕmaḍala daḍisi tā nunnām̐ḍu
yīlīlam̐ bĕnam̐gulāḍa kĕṭṭu vachcheve

(||sĕli||)
tŏḍabai śhrīveṁkaḍeśhudo nemi pŏṁdu seseve
vŏḍam̐baḍani melĕlla vŏḍim̐gaṭṭeve
aḍari nī kŏppu puvvulaṁdune pūjagŏnnām̐ḍu
baḍine yī valabela paim̐ jallugŏneve