Seliseluva memani seppemayyaa

చెలిచెలువ మేమని చెప్పేమయ్యా
Language

(॥పల్లవి॥)
చెలిచెలువ మేమని చెప్పేమయ్యా
అలమేలుమంగ నీకె యమరు నన్నిటాను

(॥చెలి॥)
కొమ్మమోముఁదమ్మి మీదికుంతలపుఁదుమ్మిదలు
సమ్మతిఁ జంద్రాస్యనేత్రచకోరములు
నెమ్మి నధరపుఁదేనె నిందునవ్వు వెన్నెలలు
వుమ్మడి నుండఁగ నంటనోడి భ్రమసెను

(॥చెలి॥)
మెలుతనాభిసరసిమీఁదిచనుజక్కనలు
మలసి కుహరనాభి మధ్యసింహము
అలరు వళితరంగాలు అందపుటారనుపాము
చెలఁగివుండఁగాఁ బ్రవేశించక భ్రమసెను

(॥చెలి॥)
తరుణిఘనకటిపులినతలపు గతిహంసలు
కరిశిరోనితంబోరుకాండకరులు
వరుసఁ జెమటేరు యౌవనవనము నుండఁగా
గురు శ్రీవేంకటేశుఁడ కూడఁగా భ్రమసెను

(||pallavi||)
sĕlisĕluva memani sĕppemayyā
alamelumaṁga nīgĕ yamaru nanniḍānu

(||sĕli||)
kŏmmamomum̐dammi mīdiguṁtalabum̐dummidalu
sammadim̐ jaṁdrāsyanetrasagoramulu
nĕmmi nadharabum̐denĕ niṁdunavvu vĕnnĕlalu
vummaḍi nuṁḍam̐ga naṁṭanoḍi bhramasĕnu

(||sĕli||)
mĕludanābhisarasimīm̐disanujakkanalu
malasi kuharanābhi madhyasiṁhamu
alaru vaḽidaraṁgālu aṁdabuḍāranubāmu
sĕlam̐givuṁḍam̐gām̐ braveśhiṁchaga bhramasĕnu

(||sĕli||)
taruṇighanagaḍibulinadalabu gadihaṁsalu
kariśhironidaṁborugāṁḍagarulu
varusam̐ jĕmaḍeru yauvanavanamu nuṁḍam̐gā
guru śhrīveṁkaḍeśhum̐ḍa kūḍam̐gā bhramasĕnu