Selimovi yemgili sesinavaamdavu maaru

చెలిమోవి యెంగిలి సేసినవాఁడవు మారు
Language

(॥పల్లవి॥)
చెలిమోవి యెంగిలి సేసినవాఁడవు మారు-
వలుక ననుచు నిట్టే బాస యిమ్మీ నాకును

(॥॥)
ఆయములు ముట్టితివి అతివకు నింతలోనే
కాయమెల్లాఁ గరఁగెను కళ దాఁకెను
చేయార నీవే యింత సేసినవాఁడవు మరి
పాయక యేలేనని బాస యిమ్మీ నాకును

(॥॥)
ననుచ మాటాడితివి నలినాక్షి యిప్పు డిట్టే
మనసు నీకొసఁగెను మరిగె నిన్ను
పనివడి యింతేసి బ్రమయించినవాఁడవు
పనుపు నేసే నని బాస యిమ్మీ నాకును

(॥॥)
అట్టే కాఁగిలించితివి అంగన నిన్నుఁ గూడి
జట్టిగొని మోహించె సతమాయను
ఱట్టుగా శ్రీవేంకటేశ యిట్టె కూడినవాఁడవు
పట్టిము గట్టేనని బాస యిమ్మీ నాకును

(||pallavi||)
sĕlimovi yĕṁgili sesinavām̐ḍavu māru-
valuga nanusu niṭṭe bāsa yimmī nāgunu

(||||)
āyamulu muṭṭidivi adivagu niṁtalone
kāyamĕllām̐ garam̐gĕnu kaḽa dām̐kĕnu
seyāra nīve yiṁta sesinavām̐ḍavu mari
pāyaga yelenani bāsa yimmī nāgunu

(||||)
nanusa māḍāḍidivi nalinākṣhi yippu ḍiṭṭe
manasu nīgŏsam̐gĕnu marigĕ ninnu
panivaḍi yiṁtesi bramayiṁchinavām̐ḍavu
panubu nese nani bāsa yimmī nāgunu

(||||)
aṭṭe kām̐giliṁchidivi aṁgana ninnum̐ gūḍi
jaṭṭigŏni mohiṁchĕ sadamāyanu
ṟaṭṭugā śhrīveṁkaḍeśha yiṭṭĕ kūḍinavām̐ḍavu
paṭṭimu gaṭṭenani bāsa yimmī nāgunu