Selimim baayagumdedi seligattenu nenu

చెలిమిఁ బాయకుండేటి చెలికత్తెను నేను
Language

(॥పల్లవి॥)
చెలిమిఁ బాయకుండేటి చెలికత్తెను నేను
వలనై నీచిత్తము వచ్చుఁగదా యిపుడు

(॥చెలి॥)
మఱవరానిమాట మగువ నీతో నాడె
గుఱుతుగాఁగఁ దలఁచుకొందువో లేదో
యెఱుకలు సేయుమనె యెచ్చరించుమనె నన్ను
కఱకుమాట లాడుట గాదుగదా నిన్నును

(॥చెలి॥)
సేయరానిచేఁతలు చెలియ నీమీఁదఁ జేసె
చేయంటి చూతువో లేదో సిగ్గువడక
కాయము విన్నంటుమనె కందువ దెలుపుమనె
రాయడించితినని దూరవుగదా ఇపుడు

(॥చెలి॥)
నగరానినవ్వు నీతో నవ్వెనలమేల్మంగ
అగడై శ్రీవేంకటేశ అవునో కాదో
నిగిడి కూడితి విట్టె నీతో నన్ను మెచ్చుమనె
జగతిఁ గేరడమై తోఁచదుగదాయిపుడు

(||pallavi||)
sĕlimim̐ bāyaguṁḍeḍi sĕligattĕnu nenu
valanai nīsittamu vachchum̐gadā yibuḍu

(||sĕli||)
maṟavarānimāḍa maguva nīdo nāḍĕ
guṟudugām̐gam̐ dalam̐sugŏṁduvo ledo
yĕṟugalu seyumanĕ yĕchchariṁchumanĕ nannu
kaṟagumāḍa lāḍuḍa gādugadā ninnunu

(||sĕli||)
seyarānisem̐talu sĕliya nīmīm̐dam̐ jesĕ
seyaṁṭi sūduvo ledo sigguvaḍaga
kāyamu vinnaṁṭumanĕ kaṁduva dĕlubumanĕ
rāyaḍiṁchidinani dūravugadā ibuḍu

(||sĕli||)
nagarāninavvu nīdo navvĕnalamelmaṁga
agaḍai śhrīveṁkaḍeśha avuno kādo
nigiḍi kūḍidi viṭṭĕ nīdo nannu mĕchchumanĕ
jagadim̐ geraḍamai tom̐sadugadāyibuḍu